ఇండియన్ టెన్నిస్ స్టార్ గా గుర్తింపు పొందిన సానియామీర్జా కు మన భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. భారత మహిళా టెన్నిస్ లో.. ఇప్పటి వరకు ఎవరూ సాధించని ఎన్నో రికార్డులను సాధించి తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఈమె పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకొని ఒక బాబుకు కూడా జన్మనిచ్చింది.. గత 20 సంవత్సరాలుగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు తరఫున షోయబ్ మాలిక్ క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే.
యూఏఈ లో జరుగుతున్న క్రికెట్ టి20 వరల్డ్ కప్ లో కూడా షోయబ్ పాకిస్తాన్ తరఫున ఆడాడు.. పాకిస్తాన్ మ్యాచ్‌లు జరిగే సమయంలో ఈమె వీఐపీ గ్యాలరీలో కూర్చుని బాగా సందడి చేసింది.. పాకిస్తాన్ కి మద్దతుగా ఆమె స్టేడియం కి రావడంతో అక్కడ వున్న ఇండియన్ క్రికెట్ ఫాన్స్ ఎవరు జీర్ణించుకోలేకపోయారు.. సోషల్ మీడియా వేదికగా ఈమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా ఈమె పౌరసత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. ఈ నేపథ్యంలోనే సోనియా మీర్జా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అయింది. అదేమిటంటే తన యాక్టింగ్ టాలెంట్ ని చూపడమే కాకుండా ఏకంగా తన భర్త షోయబ్ మాలిక్ పై కూడా ఈమె సెటైర్ వేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు..
ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ బాగా పాపులర్ అయ్యాయి.. దేశంలో టిక్ టాక్ బ్యాన్ అయిన రోజు నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ, ఆ లోటును తీర్చుంటున్నారు. ఇక తాజాగా సానియా కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక రీల్ చేసింది. ఇక ఆ వీడియో లో ఇలా వుంది.. ‘బేటా హమేషా ఉన్ లోగోంసే దూర్ రహో.. జిస్ కో తుమ్హారీ కదర్ నా హో’ అనే డైలాగ్ వుంది..ఇక ఫోన్ కాస్త పక్కకి తిప్పి వెనుక బెడ్‌పై..పక్కన పడుకున్న షోయబ్ మాలిక్‌ను చూపిస్తూ.. ఉన్హికి ఘర్ మే రెహతీ హూ అంటూ కౌంటర్ ఇచ్చింది. అసలు దీని అర్దం ఏంటంటే… ‘బిడ్డా నువ్వు ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలంటే.. కనీసం నిన్ను అభినందించని వారికి’ అని డైలాగ్ ఉంటే.. సానియా ‘నేను వాళ్ల ఇంట్లోనే ఉంటున్నాను’ అంటూ కౌంటర్ వేసింది. ఇప్పుడు ఈ రీల్ వైరల్ అయ్యింది. అయితే ఈమె పరోక్షంగా తనను గుర్తించని వారి ఇంట్లో ఉన్నాను అని , తన భర్త ని టార్గెట్ చేస్తూ ఈ మాట అనడం తో ప్రస్తుతం ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.
View this post on Instagram