సమంత..అక్కినేని నాగార్జున పెద్దకొడుకు నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంతూ..అవసరం ఉన్నా లేకున్నా పోస్ట్‌లు పెట్టుకుంటూ..నిత్యం వార్తల్లో నిలుస్తుంది. రీజన్ చెప్పకుండా విడాకులు తీసుకున్న సమంత చైతన్య..మేమొ విడిపోతున్నం అని చెప్పి సరిగ్గ నెల రోజులు కావస్తుంది. కానీ వీళ్లు ఎందుకు విడిపోయారు అనే దాని పై మాత్రం క్లారిటీ రాలేదు. వీళ్లు చెప్పలేదు.. వీళ్ల పెద్ద వాళ్లు చెప్పే సాహసం చేయలేదు. వాళ్ల నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేసిన ఈ జంటా..ఆ తరువాత సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికి..అవి ఏమి పట్టించుకోకుండా..వాళ్ల పనుల్లో బిజీ అయిపోయారు.
అయితే విడాకుల తర్వాత సామ్ హైదరాబాద్ లో ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. అయితే ఆమె ఎక్కడ ఉంటుంది.. అనే ప్రశ్న మొన్నటివరకు చక్కర్లుకొడుతూ వచ్చింది. మొత్తానికి సామ్… చైతు తనకోసం ఎంతో ప్రేమతో తీసుకున్న విల్లాలోనే ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది. తాజాగ సమంత ఫోటోస్ చూసిన వారు చైతుతో కాపురం చేస్తున్నప్పుడు ఉన్న ఇల్లు లానే ఇది కనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. విడాకుల తరువాత ఆ ఇంటిని కాళీ చేసి కొత్త ఇంటికి చైతు షిఫ్ట్ కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. జూబ్లిహిల్స్‌లోని ఓ విలాసవంతమైన ఇళ్లు కొనుగోలు చేశాడని.. ఆ రినోవేషన్ అయిపోగానే చైతు ఆ ఇంటికి వెళ్తున్నట్టు అంటున్నారు.
కానీ సమంత మాత్రం చైతుతో ఉన్న పాత ఇంటికే రావటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆ ఇంట్లో దిగిన సామ్ తన పెంపుడు కుక్కలతో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అయితే చైతూ మాత్రం కొన్నిరోజులు అందరికి దూరంగా ఉండడం కోసం నాగ్ ఇంటికి కూడా వెళ్లకుండా ఒక హోటల్ లో స్టే చేస్తున్నాడట. విడాకుల అనంతరం హైదరాబాద్‌లో ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసాడు చైతన్య.. అతి త్వరలో అందులోకి షిఫ్ట్ కానున్నాడు.