Gossipsమెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ..కుళ్లుకుంటున్న ఇతర కంటెస్టేంట్స్..?

మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ..కుళ్లుకుంటున్న ఇతర కంటెస్టేంట్స్..?

బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది మంకు తెలియని వారు కూడా పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో ఒక్కరు ఈ ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్. ఈ పేరుకు ఒకప్పుడు పరిచయం చేయాల్సి వచ్చేది . కానీ ఇప్పుడు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అంతలా తన పేరుని బిగ్ బాస్ హౌస్ ద్వార అందరికి తెలిసేలా చేసుకుంది హాత్ బ్యూటీ. బిగ్‌బాస్ 4 తెలుగు సీజ‌న్లో తన అమదంతో..తోటి కంటెస్టేంట్ అఖిల్ తో లవ్ ట్రాక్ నడిపి ఎప్పుడో ఇంటినుండి వెళ్లిపోద్ది అనుకున్న ఈమెను.. లాస్ట్ వరకు షో లో ఉంచారు.

హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్‌..తెలుగులో అల్ల‌రి న‌రేష్ మూవీ సుడిగాడుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ఆ త‌ర్వాత వెన్నెల 1 1/2, ఒక కాలేజీ స్టోరీ, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాలి సినిమాల్లోనూ మెరిసింది. అయితే ఆమెను మ‌న ప్రేక్ష‌కులు పెద్ద‌గా గుర్తుంచుకోలేదు. అప్ప‌టిదాకా ప‌లు సినిమాల్లో న‌టించినా బిగ్ బాస్ తో ఈ బ్యూటీకి క్రేజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది.

షో నుంచి బయటకు రాగానే.. ఓ డ్యాన్స్‌ షోకి జడ్జిగా వ్యవహరించింది. అంతేకాదు మోనాల్ గ‌జ్జ‌ర్ అల్లుడు అదుర్స్ చిత్రంలో సోనూసూద్‌, బెల్లంకొండ శ్రీనివాస్ తో క‌లిసి స్పెష‌ల్ సాంగ్ లో స్టెప్పులేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సాంగ్‌లో మోనాల్ చిందులాట బాగా అట్రాక్ట్ చేయడమే గాక, ఆమెకు మంచి ఫాలోయింగ్ కూడా తెచ్చిపెట్టింది.

అయితే ఇప్పుడు మోనాల్ ఇంకొక గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు అనే వార్త తోటి హీరోయిన్స్ కి..అలాగే కంటెస్టేంట్స్ ని కుళ్లుకునేలా చేస్తుంది. ఈ సుంద‌రి మ‌రోసారి ఐటెం సాంగ్ లో మెరువ‌నుంద‌న్న వార్త హాట్ టాపిక్ గా మారింది. అది కూడా మెగా పవర్ స్టార్ రాం చరణ్ పక్కన అనే సరికి మిగతా లేదీ కంటెస్టేంట్స్ కళ్లు అన్ని ఈమె పైనే పడ్డాయి.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ బట్టి..ఈ హాట్ బిగ్ బాస్ బ్యూటీకి శంకర్ డైరెక్షన్ లో రాం చరణ్ నటిస్తున్న సినిమాలో ఓ అద్దిరిపోయే ఐటెం సాంగ్ కి సెలక్ట్ అయ్యిన్నట్లు వార్తలు వస్తున్నాయి. మోనాల్ గ‌జ్జ‌ర్ ఖాతాలో భారీ ఆఫ‌ర్ వ‌చ్చి ప‌డ్డ‌ట్టు టాలీవుడ్ కోడైకూస్తుంది. ఋఛ్15 సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం మోనాల్ గజ్జర్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోనాల్‌తో చర్చలు ముగిశాయని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news