టాలీవుడ్ డేరింగ్& డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి, ఢిల్లీ భామ కేతిక శర్మ జంటగా అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రొమాంటిక్. పూరి జగన్నాథ్, వెటరన్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అక్టోబర్ 29న విడుదల అయిన ఈ సినిమా రిలీజ్ కు ముందు మాంచి రొమాంటిక్ పోస్టర్లు, రొమాంటిక్ సీన్లతో యూత్‌లో ఓ హైప్ తెచ్చుకుంది. అయితే సినిమాకు యావరేజ్ రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి.
విశ్లేషకులు అయితే పూరి మార్క్ సినిమాలాగానే ఉందని పెదవి విరిచారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో ఈ సినిమా హీరో, హీరోయిన్లను ఇంటర్వ్యూ చేయించడంతో ఫస్ట్ ఓపెనింగ్స్ కుమ్మేశాయి. ఆ తర్వాత వీక్ డేస్‌లో మాత్రం సినిమా తేలిపోయింది. దీంతో ఫస్ట్ వీక్ ముగిసే సరికి 7 రోజులకు రొమాంటిక్ వరల్డ్ వైడ్ గా రు 3.96 కోట్ల షేర్ రాబట్టింది.
అయితే ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా రూ.4.68 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ రావాలంటే రు 4.8 కోట్ల షేర్ రాబట్టాలి. ఇంకా బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకా రూ.0.72 కోట్ల షేర్ ను రాబట్టాలి. అయితే ఇప్పటికే చాలా వరకు రొమాంటిక్ ఆడుతోన్న థియేటర్లు ఖాళీ అయ్యాయి. మల్టీఫ్లెక్స్‌ల్లో మాత్రమే కొన్ని షోలు నడిపిస్తున్నారు. ఏదేమనా ఈ సినిమాకు వచ్చిన టాక్‌తో పోలిస్తే తక్కువ నష్టంతో భయట పడినట్టే..!
నైజాం – 1.24 కోట్లు
సీడెడ్ – 0.68 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.44 కోట్లు
గుంటూరు – 0.28 కోట్లు
ఈస్ట్ – 0.27 కోట్లు
వెస్ట్ – 0.20 కోట్లు
కృష్ణా – 0.24 కోట్లు
నెల్లూరు 0.17 కోట్లు
==========================
ఏపీ + తెలంగాణ (టోటల్) = 3.52 కోట్లు
==========================
రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.10 కోట్లు
ఓవర్సీస్ – 0.08 కోట్లు
==========================
వరల్డ్ వైడ్ (టోటల్) = 3.70 కోట్లు
==========================