రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. నక్సలిజం, రాజకీయం నిజజీవిత కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రివల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ అనేది విరాటపర్వం సినిమాకు ట్యాగ్‌లైన్.
ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా, ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారులకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు, రానా బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్, సంక్రాంతి పర్వదినాన రిలీజ్ చేసిన రానా-సాయిపల్లవి జంట పోస్టర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఇవన్నీ ‘విరాటపర్వం’పై అంచనాలను పెంచి.. ఆడియన్స్‌లో, ఇండస్ట్రీ వర్గాల్లో క్రేజ్ తీసుకొచ్చాయి. రానా, సాయిపల్లవి జోడీ చూడచక్కగా ఉందని అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు వచ్చాయి.
నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. 1990లో మావోయిస్టుల పోరాటానికి సంబంధించిన కథతో ఈ సినిమా ఉండనుంది. అయితే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారని మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా త్వరలో ఓ ప్రముఖ డిజిటల్ సంస్థ స్ట్రీమింగ్ చేయనుందని టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. అయితే మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకముందే ఇలా వార్తలు రావడంపై ట్విటర్ ద్వారా స్పందించాడు రానా.
ఆయన ట్వీట్ చేస్తూ..‘దయచేసి ఈ భాషా సమస్యలపై నాకు అవగాహన కల్పించండి..ఏం టైం పాస్ గాళ్లు బ్రో మీరు’ అంటూ పోస్ట్ చేశాడు. విరాటపర్వం ఓటీటీ రిలీజ్ అంటూ నకిలీ వార్తను ట్వీట్ చేసిన ఓ మీడియా సంస్థను ట్యాగ్ చేస్తూ రానా చేసిన రీట్వీట్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Pls enlighten me on these language issues 😅😅 …..emi time pass gallu bro Meru !! 😂😂 https://t.co/pqcQKChQY3
— Rana Daggubati (@RanaDaggubati) November 10, 2021