రఘువరన్ భారతదేశం గర్వించదగ్గ నటుడు. తెలుగు, తమిళ సినిమాలతో పాటు సౌత్ ఇండియాలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో విలన్గా మెప్పించాడు. అసలు విలనిజం అనేదానికి ప్రత్యేకమైన భాష్యం, ఓ సపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్న నటుడు రఘువరన్. 200 సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన రఘువరన్ ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు.
రఘువరన్ ఎంత గొప్ప నటుడు అయినా ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో అటుపోట్ల మధ్య సాగింది. ఆయన 1996లో ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్టు రోహిణిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే రఘువరన్ విపరీతమైన తాగుడుకు బానిస కావడంతో రోహిణి ఆయనకు 2004లో విడాకులు ఇచ్చేసింది. ఇక రఘువరన్ మద్యానికి బానిస కావడం వెనక ఓ హీరోయిన్ ఉందన్న ప్రచారం అప్పట్లో జరిగింది.
రఘువరన్ పెళ్లయ్యాక కూడా ఆ హీరోయిన్ను ప్రేమించాడట. ఆమె మత్తులో మునిగిపోయి అలా మద్యానికి బానిస అయ్యాడని అంటారు. ఆమె ముందుగా రఘువరన్ను ప్రేమించి.. తన అవసరాలు తీర్చుకుంది. ఆ తర్వాత రఘువరన్ను దూరం పెట్టడంతో ఆ బాధతోనే మనోడు విపరీతంగా మద్యానికి బానిస అయిపోయాడు. ఆ తర్వాత ఆ హీరోయిన్ ఓ పెద్దంటి కోడలు అయ్యింది. అలా తన భార్యకు దూరమైపోయాడు. ఇక విపరీతమైన మద్యం సేవించడం వల్లే రఘువరన్ చిన్న వయస్సులోనే చనిపోయాడు.