Moviesసమంత కోసం తాప్సీ ఇంత పని చేసిందా..?

సమంత కోసం తాప్సీ ఇంత పని చేసిందా..?

సమంత నాగ చైతన్య తో విడాకుల తరువాత వరుస సినిమాలకు కమిట్ అవుతూ..తన కెరీర్ ని స్పీడ్ అప్ చేసుకుంటుంది. ఓ వైపు టాలీవుడ్..మరోవైపు కోలీవుడ్,,ఇప్పుడు బాలీవుడ్ అన్నీ ఇండస్ట్రీలో సత్తా చాటడానికి తెగ ట్రై చేస్తుంది ఈకుందనపు బొమ్మ. అంతేకాదు.. కమర్షియల్ చిత్రాల్లోనూ నటించేందుకు సామ్ ఆసక్తి చూపిస్తుందట. ఇక తాజా సమాచారం ప్రకారం.. సామ్.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

ఓ స్టార్ హీరోయిన్ తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమైందని బాలీవుడ్ మీడియా కోడైకూస్తుంది. ఇంతకి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..తాప్సీ. యస్..ఈ ఢిల్లీ ముద్దుగుమ్మతో కలిసి..బాలీవుడ్ లో ఓ బడా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా ఒకరికిగా ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చిన తాప్సీ కి బాలీవుడ్ బాగానే కలిసి వచ్చింది. చేసిన ప్రతి సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు..ఫ్రేంద్స్ ను కూడా ఏర్పర్చుకుంది. దీంతో అమ్మడుకి ఇప్పుడు బాలీవుడ్ లో సర్కిల్ బాగానే ఉంది.

ఈమధ్యమే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి.. అదే బ్యానర్ పై సినిమాను నిర్మించేందుకు రెడీ అయ్యింది ఈ హాట్ బ్యూటీ. ఇక తాప్సీ స్వయంగా ఫోన్ చేసి సమంత ను రిక్వెస్ట్ చేసి తన బ్యానర్ లో సినిమా చేసేందుకు ఆమే చాలా కష్టపడ్డారట. ఓ ప్రముఖ దర్శకుడితో కథను కూడా సిద్దం చేయించుకుందని టాక్. ఇక అందులో సమంత నటించడానికి ఓకే చేప్పిన్నత్లు తాజా సమాచారం. ఈ విషయంపై మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించినట్లుగా తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news