దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరోలు ఎన్టీఆర్ – రామ్‌చరణ్ కాంబినేషన్లో వస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా కొమరం భీం, అల్లూరి సీతారామరాజు ఒకేసారి బ్రిటీషర్లపై కలిసి పోరాటం చేస్తే ఎలా ? ఉంటుందన్న ఊహాత్మక కథతో తెరకెక్కుతోంది.
పైగా బాహుబలి ది కంక్లూజన్ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రాజమౌళి ఈ కథకు రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ అవుతుందన్న నమ్మకం లేక అంతకు ముందు వేరే కాంబినేషన్లతో చేయాలని అనుకున్నారట. అయితే చివరకు టాలీవుడ్ క్రేజీ హీరోలు ఎన్టీఆర్ – రామ్‌చరణ్ కాంబినేషన్నే సెట్ చేశారు.
ఈ విషయాన్ని ఈ సినిమా స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముందుగా రజనీకాంత్-ఎన్టీఆర్, అల్లు అర్జున్- ఎన్టీఆర్, కార్తీ- సూర్య, కార్తీ- అల్లు అర్జున్ ఇలా రకరకాలుగా కాంబినేషన్లలో ఈ సినిమా తీస్తే ఎలా ? ఉంటుందా ? అని చర్చలు నడిచాయట.
ఏదేమైనా టాలీవుడ్ చరిత్రలోనే ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ నె సెట్ చేయడంలో దర్శకుడు రాజమౌళి సగం సక్సెస్ అయ్యాడు. ఇక రేపటి రోజు ఆర్ ఆర్ ఆర్ ఎన్నెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో ? చూడడం ఒక్కటే మిగిలి ఉంది.