MoviesR R R సెన్సార్ రిపోర్ట్ & ర‌న్ టైం డీటైల్స్‌.....

R R R సెన్సార్ రిపోర్ట్ & ర‌న్ టైం డీటైల్స్‌.. సినిమా టాక్ ఇంత భీభ‌త్సంగానా…!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్‌కు మ‌రో నెల‌న్న‌ర టైం ఉన్నా కూడా అప్పుడే దేశ‌వ్యాప్తంగా ఆ మానియా అయితే స్టార్ట్ అయ్యింది. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనూ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఇద్ద‌రు క్రేజీ హీరోలు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇక ఏ సినిమా అయినా రిలీజ్‌కు ఒక వారం ముందు సెన్సార్‌కు వెళుతుంది. అయితే ఆర్ ఆర్ విష‌యంలో మ‌రి ఏం ప్లాన్ చేశారో కాని అప్పుడే సెన్సార్‌కు వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ కాగా సెన్సార్ బోర్డు నుంచి టాక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ ఫినిష్ అవ్వ‌డంతో నెల‌న్న‌ర ముందే సెన్సార్ కంప్లీట్ చేసేశారు. ఇయ యూ / ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చిన ఈ సినిమా ర‌న్ టైం 3 గంట‌ల పాటు ఉంద‌ని అంటున్నారు.

ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో సినిమా ర‌న్ టైం 3 గంట‌లు అంటే చాలా ఎక్కువే అనుకోవాలి. అయితే రాజ‌మౌళి మెస్మ‌రైజ్ చేస్తే మూడు గంట‌ల పాటు సినిమా చూడ‌డం పెద్ద ఇబ్బందేం ఉండ‌ద‌నుకోవాలి. ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో పాటు ఆలియా భ‌ట్‌, అజ‌య్‌దేవ‌గ‌న్ లాంటి వాళ్లు ఉన్నారు కాబ‌ట్టి.. వీరంద‌రికి స‌రైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటే మూడు గంట‌లు క‌ళ్లు మూసుకుని తెరిచే లోనే అయిపోతుంద‌ని అంటున్నారు.

ఇక సినిమాలో యాక్ష‌న్ సీన్లు చూస్తుంటే క‌ళ్లు చెదిరిపోవ‌డంతో పాటు మ‌తిపోయేలా ఉంద‌ని ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ యాక్ష‌న్ సీన్ల వ‌ల్లే సెన్సార్ వాళ్లు యూ / ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చార‌ని అంటున్నారు. సినిమాలో కంటెంట్ ప్రేక్ష‌కుల‌ను మంత్ర ముగ్ధుల‌ను చేస్తుంద‌ని చెపుతున్నారు. మ‌రి బాహుబ‌లిని మించి ఆర్ ఆర్ ఉంటుందా ? లేదా ? అన్న‌ది తెలియాలంటే వ‌చ్చే నెల 7వ తేదీ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news