కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణాన్ని దేశ వ్యాప్తంగా సినీ అభిమానులే కాకుండా సాధారణ జనాలు సైతం జీర్ణించు కోలేక పోతున్నారు. కేవలం 46 సంవత్సరాల వయస్సు.. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ఈ స్టార్ హీరో గుండె పోటుతో మృతి చెందడం ఎంతో మంది అభిమానులకు వేదన మిగిల్చింది. అసలు పునీత్ చనిపోయారంటే ఎవ్వరూ నమ్మడం లేదు. చివరకు కర్నాకట సీఎం బొసవరాజ్ బొమ్మై సైతం పునీత్ పార్థీవ దేహానికి ముద్దు పెట్టి మరీ పవర్ స్టార్ ఎంత మంచి వ్యక్తో… ఆయన ను కోల్పోవడం ఇంత బాధాకరమో చెప్పకనే చెప్పారు.
ఇక ఎవరికి వారు పునీత్ కు తమ స్వగ్రామాల్లో , తమ ఇళ్ల ల్లో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నాకట లో అప్పుడే పెళ్లి అయిన కొత్త దంపతులు పెళ్లి మండపంలోనే పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు శ్రద్ధాంజలి ఘటించి తమ అభిమానం చాటుకున్నారు. మైసూరు సిద్ధార్థ నగరలోని కనక భవనంలో ఆదివారం మను కిరణ్, లావణ్య అనే నూతన జంట పెళ్లి జరిగింది.
పెళ్లి అయిన వెంటనే వారు అక్కడే పునీత్ రాజ్‌కుమార్ చిత్రపఠం ఏర్పాటు చేసి మరీ ఘనంగా నివాళులు అర్పించారు. ఆ పెళ్లికి వచ్చిన వారంతా ఓ వైపు కొత్త జంటను ఆశీర్వదించడంతో పాటు పునీత్‌కు శ్రద్దాంజలి ఘటించారు. ఇక ఆ పెళ్లికి వచ్చిన చాలా మందికి పునీత్ లేడన్న బాధ మామూలుగా లేదు. ఇక కర్నాకటలో పలు చోట్ల పునీత్ అభిమానులు కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.