Moviesఆ రోజు అక్కడ హరికృష్ణ లేకపోతే ఎప్పుడో చనిపోయే వాడిని అంటున్న...

ఆ రోజు అక్కడ హరికృష్ణ లేకపోతే ఎప్పుడో చనిపోయే వాడిని అంటున్న పృథ్వీరాజ్‌..!!

పృథ్వీరాజ్‌ .. ఈ పేరు చెబితే గుర్తు పట్టడం కొంచెం కష్టమే కానీ 30 years ఇండస్ట్రీ అనే డైలాగ్ చెప్పితే మాత్రం.. అందరు టక్కున గుర్తుపట్టేస్తారు. తన నటనతో ,కామెడీ టైమింగ్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ స్ధానాని సంపాదించుకున్నారు. ముఖ్యంగా కొన్ని సినిమాలో ఈయన నటన అదుర్స్ అనే చెప్పాలి. కెరీర్ లో ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా ఖడ్గం అనే సినిమా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత కొన్నేళ్లపాటు పృథ్వీరాజ్‌ స్టార్ కమెడియన్ గా దూసుకుపోయారు. వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న స్టార్ కమెడియన్ పృథ్వీరాజ్.. ఎవ్వరు ఊహించని విధంగా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి తన తల రాతను తానే మార్చుకున్నాడు.

ముఖ్యంగా కొన్ని నెలల కిందట ఈయన మీద వచ్చిన వార్తలు అందరిని షాకింగ్ కు గురిచేసాయి. కొన్ని వివాదాల కారణంగా వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. ఓ మహిళా ఉద్యోగినితో రొమాంటిక్‌గా మాట్లాడిన ఆడియో టేపు విషయంలో ‘థర్టీ ఇయర్స్ పృథ్వీ’ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలీసందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో టేప్ ప్రకారం.. “నేను నీకు గుర్తు రాలేదా..? నువ్వు గుండెల్లో ఉన్నావ్ అని. వెనుక నుంచి వచ్చి నిన్ను గట్టిగా పట్టుకుందామని అనుకున్నాను. కానీ నువ్వు అరుస్తామని ఆగిపోయానని” పృథ్వీ చెప్పినట్లుగా ఉన్న ఆడియో తెగ వైరల్ అయ్యింది. ఇక దీంతో ఆయన సినీ జీవితం, రాజకీయం జీవితం రెండు నాశనం అయిపోయాయి.

ఇక కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. కాగా, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ ..కొన్ని ఆశక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.. ఆయన మాట్లాడుతూ..”గండిపేట రహస్యం అనే సినిమా లో నా చేత అశోక్ గజపతిరాజు గెటప్ వెయించాలి అనుకున్నారు. ఆ పాత్రకి నేను బాగా సెట్ అవుతానూ నై అనుకున్నారు. నేను పెద్దాయన లా ఉంటాను అని చెప్పి ఈ వేషం వేయించారు..కానీ లాస్ట్ కి ఈ పాత్ర ఇంత వివాదం అవుతుంది అని నేను అనుకోలేదు. నిజానికి అప్పుడు నేను అయ్యప్ప స్వామీ మాలలో ఉన్నాను . నేను ప్రభాకర్ రెడ్డి థియేటర్ కు వెళ్లగా అక్కడ నన్ను చూసిన జనం సడెన్ గా పరిగెత్తుకుంటూ కొట్టడానికి వచ్చారు.

ఇక అదే అక్కడే ఉన్న నందమూరి హరికృష్ణ గారు తన కారు ఎక్కించుకుని నన్ను అక్కడ నుండి తీసుకెళ్లి నా ప్రాణాలు కాపాడారు. హరికృష్ణ గారు లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు నన్ను బాగా కొట్టేవారు. ఇక అలాగే నాలుగు సంవత్సరాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కనిపించకుండా తిరిగా. కొందరు అభిమానులు అయితే కనిపిస్తే ముక్కు చెవులు కోస్తామని కూడా బెదిరించారని. నన్ను కాపాడిన హరికృష్ణకు నేను ఎల్లప్పుడు రుణపడి ఉంటాను. నిజానికి ఆయన అక్కడ లేకపోతే వారి చేతిలో నేను ఎప్పుడో చనిపోయే వాడిని పృథ్వీరాజ్ తెలిపాడు.

Latest news