లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అయిపోతాడని నిన్నటి వరకు ఒక్కటే చర్చలు నడిచాయి. ఇటీవల ప్రభాస్‌తో మొదలు పెడితే మన స్టార్ హీరోలు పాన్ ఇండియా కీర్తనలు ఆలపిస్తుండడంతో విజయ్‌కు కూడా ఆ అదృష్టం ఉందేమో అనుకున్నారు. అయితే ఇప్పుడు రొమాంటిక్ రిజల్ట్ చూశాక జనాలు మాత్రం పాన్ ఇండియా కాదు చెరువు కాదు.. ఆ సినిమాకు తెలుగులో బిజినెస్ జరిగితేనే గొప్ప అంటున్నారు.
గత పదేళ్లలో పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు ఎంత దారుణంగా ఉందో తెలిసిందే. ఒకప్పుడు పూరి అంటే కొత్త కథలకు కేరాఫ్. నాలుగైదు నెలల్లోనే సినిమాలు తీసి బ్లాక్ బస్టర్లు కొట్టడం పూరి స్టైల్. అలాంటి పూరి పదేళ్లలో ఎంచుకున్న కథలు చూస్తుంటే ఆ బ్యాంకాంక్ కథలు, విలన్ల గడ్డాలు, ఇదే ఫార్ములాను మార్చి మార్చి తీస్తూ పాతాళంలోకి పడిపోయాడు. పూరిని చాలా మంది మర్చిపోయారు.
అలాంటి డైరెక్టర్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వెలుగులోకి వచ్చాడు. ఆ సినిమా కూడా కథలో దమ్ము ఉండి ఆడలేదు. ఇక ఇప్పుడు ఆ సినిమా ఫలితం చూసే విజయ్ పూరికి లైగర్ ఛాన్స్ ఇచ్చాడు. పైగా కరణ్ జోహార్ ఇందులో యాడ్ అయ్యాడు. పాన్ ఇండియా రేంజ్ అని ప్రమోషన్ చేస్తున్నారు. అసలు పూరి తన కొడుకు సినిమానే కాన్‌సంట్రేషన్ చేసి తీయడం లేదు. మెహబూబా ఘోరమైన డిజాస్టర్.
ఇప్పుడు రొమాంటిక్ కథ, స్క్రీన్ ప్లే ఇచ్చింది కూడా పూరీయే. పైగా లైగర్ స్టిల్స్ చూస్తే ఆ గెడ్డాలు, బాక్సింగ్ ఇవన్నీ అమ్మానాన్న తమిళ అమ్మాయి నుంచి చూస్తున్నవే. ఏదేమైనా రొమాంటిక్ దెబ్బతో లైగర్ సినిమాపై బిజినెస్ సర్కిల్స్, ప్రేక్షకుల్లో కొత్త భయాలు స్టార్ట్ అయిపోయాయి.