Moviesతొక్కిపారదొబ్బుతా.. మాస్ డైలాగుల‌తో గర్జించిన బాలయ్య..!!

తొక్కిపారదొబ్బుతా.. మాస్ డైలాగుల‌తో గర్జించిన బాలయ్య..!!

ఎప్పట్నుంచో బాలయ్య అభిమానులు వేచి చూస్తున్న అఖండ ట్రైలర్ వచ్చేసింది. విడుదలైన క్షణం నుంచి యూ ట్యూబ్‌లో సంచలనాలు రేపుతుంది ఈ ట్రైలర్. నందమూరి నట సింహం బాలకృష్ణ నుండి సినిమా వస్తుంది అంటే బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. బాలయ్య సినిమాలలో అయన నటన, యాక్షన్ సన్నివేశాలు చూసేందుకు ఎంతో ఇష్టపడతారు ఆయన అభిమానులు. గత పదేళ్లలో బాలకృష్ణకు సింహ, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి మాత్రమే హిట్ అయ్యాయి.

ఈ మూడు సినిమాల్లో రెండింటికి బోయపాటి శ్రీను దర్శకుడు. దాన్ని బట్టి వారిద్దరి కాంబినేషన్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే మూడోసారి ఈ కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరొయిన్ గా వస్తున్న చిత్రం “అఖండ” బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిరియాల రవీందర్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖండ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేసారు ఆ చిత్ర యూనిట్. ట్రైలర్ లో బాలయ్య పంచ్ డైలాగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.

అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా.. పట్టుసీమ తూమా..అంతూ పవర్ ఫుల్ డైలుగులు బాలయ అదరగొట్టేసారు. ఒకమాట నువ్వంటే శబ్ధం.. అదే మాట నేనంటే శాసనం.. దైవ శాసనం..అంటూ విలన్ గుండెల్లో వణుకు పుట్టిస్తు మాస్ డైలాగ్స్ తో రచ్చ రచ్చ చేసారు. ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకుల్లేని బుల్‌డోజర్‌ని.. తొక్కిపారదొబ్బుతా.. అంటూ తనదైన శైలిలో రచ్చ చేస్తున్నాడు నందమూరి నటసింహా బాలకృష్ణ.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news