నమ్రత సిరోద్కర్..ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. ఒక్కప్పుడు తన నటనతో..తన అందంతో కుర్రకారుకి మతిపోగొట్టిన ఈ భామ..ఎంతో మంది కలల రాకుమారి. ఈమె అందంకు పడిపోని వారంటూ లేరు. ఇక ఆ లిస్ట్ టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు కూడా ఉన్నారండోయ్. వంశీ సినిమా కోసం వీళ్లిద్దరు కలిసి వర్క్ చేసారు. ఇక ఆ సినిమా షూటింగ్ టైంలోనే వీళ్ల మనసులు కలిసాయి. ఇక అలా వీరిద్దరు ప్రేమలో పడిపోయారు.
మహేష్ బాబుకి నమ్రత ఎంత నచ్చేసిందంటే.. తన కోసం వాళ్ల ఇంట్లో కూడా చెప్పకుండా ఏకంగా ముంబై వెళ్లి ఎవ్వరికి తెలియకుండా ఆమెను చూసి వచ్చేవారట. ఇక ఆ తరువాత ఇంట్లో వాళ్లను ఒప్పించి..మహేష్ నమ్రతను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లోనే మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా ఉన్న వీరికి ఒక్క పాప సితార,బాబు గౌతం ఉన్నారు. కాగా, నమ్రత మహేహ్ బాబు తో నటించిన ఓ బాలీవుడ్ హీరోయిన్ కు కాల్ చేసి మరీ తన భర్త జోలికి వస్తే తాట తీస్తా అని వార్నింగ్ ఇచ్చిందట.
ఇంతకి ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?..మహేష్ బాబు కెరీర్ లోనే పరమ చెత్త మూవీగా టాక్ తెచ్చుకున్న “అతిధి” సినిమా గుర్తుంది కదా..ఆ సినిమాలో మహేష్ బాబు పక్కన అమృత హిరోయిన్ గా నటించింది. ఇక సినిమా షూటింగ్ టైంలో అమ్మడు మహేష్ బాబుతో ఎక్కువ చనువుగా ఉండడం. అవసరం ఉన్నా, లేకున్నా ఫోన్ లు చేయడం లాంటి పనులు చేస్తుండేదట. ఇక విసిగిపోయిన మహేష్ ఈ విషయాని నమ్రతను డీల్ చేయమన్నారట. భర్త జోలికి వస్తే ఏ భార్య ఊరుకుంటుంది చెప్పండి..నమ్రత తనదైన స్టైల్లో కాల్ చేసి మరీ మహేష్ కు దూరంగా ఉండూ లేకపోతే నేనేంటో చూపిస్తా..అంటూ క్లాస్ పిల్లకి మాస్ వార్నింగ్ ఇచ్చిన్నట్లు అప్పట్లో వార్తలు హల్ చల్ చేసాయి.