Moviesఆ ముఖ్య‌మంత్రి కెరీర్‌లో చూసిన ఒకే ఒక్క సినిమా నాగార్జున‌దే...!

ఆ ముఖ్య‌మంత్రి కెరీర్‌లో చూసిన ఒకే ఒక్క సినిమా నాగార్జున‌దే…!

స‌హ‌జంగానే రాజ‌కీయ నేత‌ల‌కు సినిమాలు చూసే టైం త‌క్కువుగా ఉంటుంది. వారికి ప్ర‌తిక్ష‌ణం ప్ర‌జ‌ల‌తోనే సంబంధాలు ఉండాలి.. వారు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉండాలి. చాలా త‌క్కువగా మాత్ర‌మే వారు ఎంజాయ్ చేసేందుకు టైం ఉంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌రిస్థితే ఇలా ఉంటే.. ఇక ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వారికి అస‌లు ఏ మాత్రం టైం ఉండ‌దు. ఈ క్ర‌మంలోనే స‌మైక్యాంధ్ర ప్ర‌దేశ్‌కు మాజీ ముఖ్య‌మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్క‌ర‌రావు త‌నకు సినిమాలు చూసే టైం ఉండ‌ద‌ని.. త‌న జీవీతంలో ఒకే ఒక్క సినిమా చూశాన‌ని ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

త‌న‌కు పెద్ద‌గా సినిమాల‌పై ఆస‌క్తి ఉండ‌ద‌న్న ఆయ‌న నాగార్జున న‌టించిన అన్న‌మ‌య్య సినిమా మాత్ర‌మే చూశాన‌ని చెప్పారు. ఆ సినిమాలో పాట‌ల‌తో పాటు నాగార్జున న‌ట‌న త‌న‌కు బాగా న‌చ్చింద‌న్నారు. కె. రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వంలో తిరుమ‌ల శ్రీ వెంక‌టేశ్వ‌రుడి భ‌క్తుడు తాళ్ల‌పాక అన్న‌మాచార్యుల జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. వి. దొర‌స్వామి రాజు ఈ సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

దివంగ‌త లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావుతో నాదెండ్ల భాస్క‌ర్‌రావుకు సాన్నిహిత్యం ఉండేది. వారిద్ద‌రి ఇళ్లు కూడా ప‌క్క ప‌క్క‌నే ఉండేవి. నాగేశ్వ‌ర‌రావుకు ఫ్రీ టైం ఉన్న‌ప్పుడు భాస్క‌ర‌రావు ఇంటికి వెళ్లి ప‌లు అంశాల‌పై చ‌ర్చించే వారు అట‌. అలాగే సూప‌ర్ స్టార్ కృష్ణ కూడా నాదెండ్ల సొంత ప్రాంతం అయిన తెనాలికి చెందిన వారే. ఆయ‌న‌తో కూడా ఎంతో స‌న్నిహితంగా ఉండేవారు.

అయినా కూడా నాదెండ్ల‌కు సినిమాలు చూడాల‌న్న ఆస‌క్తి మాత్రం ఎప్పుడూ లేద‌ట‌. అయితే ఏఎన్నార్ కోరిక మేర‌కు ఒక్క అన్న‌మ‌య్య సినిమా మాత్ర‌మే చూశానిని నాదెండ్ల చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news