దక్షిణాది లేడి సూపర్‌స్టార్ గా పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసే రమ్యకృష్ణ.. సినీ ఇండస్ట్రీకి ఎంటర్ అయిన అనతికాలంలోనే టాప్ హీరోయిన్ గా మారి.. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లోని పలువురు స్టార్ హీరోలతో జోడి కట్టి తిరుగులేని విజయం అందుకుంది. దాదాపు సినీ ఇండస్ట్రీలో మూడు దశబ్ధలకు పైగా రాణిస్తున్న రమ్యకృష్ణ నీలాంబరి గా, శివగామిగా ఇలా ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది.బాహుబలిలో శివగామిగా ప్రభాస్ తల్లిగా నటించి ఇంటర్నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యింది రమ్యకృష్ణ.
ఫ్యామిలీ ఓరియంటెడ్, లేడీ ఓరియంటెడ్ ఏ సినిమా అయినా రమ్యకృష్ణ నటనకు తిరుగు లేదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవి, రమ్యకృష్ణ సిలవర్ స్క్రీన్ పై వీళ్లిద్దరి బొమ్మ పడితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు..బాక్స్ ఆఫిస్ కలెక్షన్స్ ని కూడా షేక్ చేస్తుంది. అంత పవర్ ఉంది ఈ రీల్ జంటకి. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు వన్ ఆఫ్ ది సెన్సేషనల్ కాంబినేషన్ ఈది. ఈ కాంబినేషన్‌లో బోలెదు సినిమాలు వచ్చాయి. అందులో చాలా వరకు అన్ని సంచలన విజయాలే సాధించాయి. కొన్ని ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న తెర పై ఈ జంట అదుర్స్ అనిపించుకున్నారు. ఆ తర్వాత రమ్యకృష్ణ తన ఇమేజ్, ఏజ్‌కు తగిన పాత్రలు చేస్తూ బిజీ అయిపోయింది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో రమ్యకృష్ణ నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా మలయాళంలో సూపర్ హిట్ సాధించిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో మంజు వారియర్ ఆయన సోదరి గా నటించింది . ఇప్పుడు ఇదే పాత్రలో తెలుగులోలో రమ్యకృష్ణ.. చిరంజీవి సోదరిగా నటిస్తున్నట్లుగా సమాచారం. ఒక్కప్పుడు తెర పై సూపై హిట్ జంట గా పేరు తెచ్చుకున్న వీరు..ఇప్పుడు అన్నా చెల్లెలుగా చేయడానికి ఎలా ఒప్పుకున్నారు అంటూ నెట్టింట అభిమానులు చర్చించుకుంటున్నారు.