టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశూరాం డైరెక్షన్ లో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా మహానటి కీర్తి సురేష్ నతిస్తుంది. కాగా షూటింగ్ లో బిజీ గా ఉన్నా కూడా తారక్ కోసం మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోకి గెస్ట్ గా హాజరైయ్యారు. దీనికి సంబంధిచిన ప్రోమోని జెమిని టీవీ ఇప్పటికే రిలీజ్ చేసింది. ఈ ఇద్దరు హీరోలను ఒక్కే స్క్రీన్ పై చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
నిజానికి జూనియర్ ఎన్టీఆర్‌తో మహేష్ బాబుకు ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆ సన్నిహిత్యంతోనే అప్పట్లో భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చాడు. ఇక ఆ తర్వాత వీళ్లు కలిసి ప్రైవేట్ పార్టీలు కూడా చేసుకున్నారు. ఇక నమ్రత లక్ష్మి ప్రణతి కూడా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం మనకు తెలిసిందే. ఇక తాజాగా బుల్లితెర ప్రేక్షకులను అలరించే రియాలిటీ షోలలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు మహేష్ బాబు అతిధిగా వచ్చాడు. ఇక మహేష్ ఎంట్రీ రాగానే తనదైన స్టైల్లో ఆయనను రిసీవ్ చేసుకున్నాడు తారక్. ఇక మహేష్ బాబు పంచ్ డైలాగులతో అదరగొట్టేసారు అనే చెప్పలి. సాధారణంగానే మహేష్ కు మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది.
జనరల్ గా మహేష్ బాగా క్లోజ్ ఉన్నవాళ్లతోనే ఓపెన్ అవుతుంటాడు ..ఇక తారక్ తో కూడా అలాగే సరదాగా మాట్లాడాడు. అందుకే ఈ షోకు వచ్చిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో సరదాగా మాట్లాడుతూ కనిపించాడు. ఇక మహేశ్ బాబు పాల్గొన్న ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. ఈ క్రమంలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌లో ‘మహేష్ ఎంత గెలుచుకున‍్నాడో అని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..సూపర్ స్టార్ మహేశ్ బాబు రూ. 25 లక్షలు గెలుచుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆయన గెలుచుకున్న మొత్తాన్ని అంతా ఛారిటీ కోసం కేటాయించి తన మంచి మనసు చాటుకున‍్నాడట ఈ ఘట్టమనేని వారసుడు.