Moviesస్టార్ హీరోలతో వర్క్ చేసిన తమన్.. ప్రభాస్ కు ఎందుకు చేయలేదో...

స్టార్ హీరోలతో వర్క్ చేసిన తమన్.. ప్రభాస్ కు ఎందుకు చేయలేదో తెలుసా..?

తమన్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో తమన్ హవానే కొనసాగుతోంది. వరుస హిట్లతో తమన్ దూసుకుపోతోన్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికీ అల వైకుంఠపురములో ఫీవర్ ఎవ్వరినీ వదలడం లేదు. ఎక్కడో చోట ఆ పాటలు ఇంకా మార్మోగిపోతూనే ఉన్నాయి. అలాంటి పాటలు ఇచ్చిన తమన్ ఇప్పుడు మళ్లీ అందరినీ మెస్మరైజ్ చేసేందుకు బయల్దేరారు. ప్రస్తుతం బడా హీరోలందరి సినిమాలకు ఈయననే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు తమన తన కెరీర్ లో ఆల్ మోస్ట్ అందరి బిగ్ స్టార్స్ సినిమాలకి సంగీతం అందించాడు. ఒక్క ప్రభస్ సినిమాకు తప్ప. ఇప్పుడు ఇదే విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అసలు ప్రభాస్ సినిమాకి తమన్ ఎందుకు మ్యూజి ఆఫర్ అందుకోలేకపోయాడు అని నెట్టింట మారుమ్రోగిపోతుంది. అయితే నిజానికి ప్రభాస్ నతించిన రెబల్ మూవీ కి తమన్ సంగీతం అందించాలి అనుకున్నాడట. కానీ, మధ్యలో లారెన్స్ వల్ల ఆ సినిమాకు బ్రేక్ లు పడ్డాయట. ఈ విషయాని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు.

అఖండ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్ ఈ విషయంపై స్పందించాడు. నిజానికి ప్రభాస్ ‘రెబల్’ సినిమాకి పనిచేసే అవకాశం వచ్చిందట. కానీ చివరకు ఆ సినిమాకి సంగీతం కూడా తానే చేయాలని లారెన్స్ అనుకోవడంతో ఆయన ఆ సినిమా నుండి తప్పుకున్నాడట. ఇక అప్పటి నుంచి ప్రభాస్ తో ఏ ప్రాజెక్ట్ సెట్ కాలేదట. ఇప్పటికీ ఆయన సినిమాలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారట. త్వరలో ప్రభాస్ సినిమాకి పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news