Moviesకాజల్ కీలక నిర్ణయం..సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న గౌతమ్ కిచ్లు..?

కాజల్ కీలక నిర్ణయం..సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న గౌతమ్ కిచ్లు..?

టాలీవుడ్‌లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా స్టార్ బ్యూటీల లెక్కే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా కొంతకాలం స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేసిన బ్యూటీలు ఫాం కోల్పోయినవెంటనే ఫేడ్ అవుట్ అయిపోతారు. కానీ తెలుగులో దశాబ్ధ కాలంగా స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న బ్యూటీలు కొందరు ఉన్నారు. వీరిలో అందాల చందమామ కాజల్ కూడా ఒకరు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 13 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ టాప్ హీరోయిన్ గానే రాణిస్తోంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తన అందంతో తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది కాజల్ అగర్వాల్.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసి..వచ్చిన ఏ చిన్న అవకాశాని వదులుకోకుండా బడా బడిగా సినిమాలు చేసుకుంటూ పోతూ.. తన ఖాతాలో బ్లాక్ బస్టర్ సినిమాలను వేసుకుంది. కోలీవుడ్ లోను తనదైన స్టైల్లో రాణించిన కాజల్ అగర్వాల..అక్కడ కూడా ఆల్ మోస్ట్ అందరి టాప్ హీరో సరసన నటించింది. ఇక ముదురు ముద్దుగుమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఊరించి ఊరించి ఎట్ట‌కేల‌కు ఓ ఇంటిది అయ్యింది. వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలుతున్న కాజల్ అగర్వాల్ ప్రముఖ బిజినెస్ మాన్ గౌతమ్ కిచ్లూ ను ప్రేమ వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాజల్.. తన భర్త గౌతమ్ కిచ్లును సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకుంటుందట. తన వద్దకు వచ్చిన దర్శకనిర్మాతలకు.. తన భర్త గౌతమ్ కిచ్లుకు ఒక రోల్ ఇవ్వాలని అడుగుతుందట. తనతో బాగా క్లోజ్ గా మెలిగిన నిర్మాతలను మరియు హీరోలను కలిసి తన భర్తకు వేషాలు ఇప్పించడానికి తెగ కష్టపడి పోతుందట. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం కాజల్, హైదరాబాద్ లోనే మకాం పెట్టిందట. ఇక కాజల్ భర్త గౌతమ్ కి కూడా నటనపై ఆసక్తి ఉందని తెలుస్తుంది. అందుకే, కాజల్అందర్నీ తన భర్తకు ఛాన్స్ ఇవ్వాలని బలంగా కొరుకుతోందట. మరి కాజల్ కోరికను ఎవరు తీరుస్తారో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news