Moviesసూర్య వ‌ల‌నే నాకు ఈ తలనొప్పి..జ్యోతిక‌ షాకింగ్ కామెంట్స్..!!

సూర్య వ‌ల‌నే నాకు ఈ తలనొప్పి..జ్యోతిక‌ షాకింగ్ కామెంట్స్..!!

సూర్య-జ్యోతిక‌..కోలీవుడ్ లో వన్ ఆఫ్ ది రొమాంటిక్ కపుల్. ఈ జంట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రీల్ అండ్ రియల్‌ లైఫ్ హిట్‌ పెయిర్‌లలో సూర్య, జ్యోతిక కూడా ఒకరు. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు ఆరు చిత్రాల్లో నటించారు. చివరిసారిగా సిల్లును ఒరు కాదల్‌ అనే మూవీలో కనిపించారు. ఇక ఆ తరువాత ఈ ఇద్దరు పెళ్లి చేసుకోగా.. జ్యోతిక కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక ఐదేళ్ల క్రితం సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన జ్యోతిక.. కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో మాత్రమే నటిస్తూ వస్తున్నారు.

ఇక వెర్సటైల్ యాక్టర్ సూర్య వరుస సినిమాలతో స్పీడ్ మీదున్నారు. పాండమిక్ కారణంగా థియేటర్లు మూతపడడంతో తన సినిమాలను ఓటీటీలో విడుదల చేసి డేర్ స్టెప్ తీసుకోవడంతో పాటు విజయాలు సాధించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయినా జై భీం కూడా ఎంత మంచి టాక్ ను సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. ఇక జ్యొతిత ఇద్దరు పిల్లల తల్లి అయినా ఇప్పటికి సినిమాల్లో నటిస్తుందంటే దానికి భర్త సపోర్ట్ ఎంతైనా ఉంటుంది.

ఇక ఈ విషయాల గురించి జ్యోతిక తన మనసులోని మాటలు మీడియాతో పంచుకుంది.భర్త సూర్య గురించి మాట్లాడుతూ..సూర్య చాలా రొమాంటిక్ అని…తనని పిల్లలను బాగా చూసుకుంటారని చెప్పుతూ.. ప్రొడక్షన్ హౌస్ లో నాకు నచ్చిన సినిమాలను ఎంకరేజ్ కూడా చేస్తారు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు భార్య మాటకు వాల్యూ ఇస్తారు అని కూడా చెప్పింది. ఇక సూర్య కు ఉన్న లేడీ ఫాలోయింగ్ గురించి మాట్లాడుతూ..హా..అంతా భారీ లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండటం వల్ల నాకు తలనొఫ్ఫి కొంచెం ఎక్కువగానే ఉంటుందని జ్యోతిక నవ్వుతూ చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news