యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. డిసెంబర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా అలా పూర్తయ్యిందో లేదో వెంటనే బాలయ్య నెక్ట్స్ సినిమా పట్టాలెక్కేసింది. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న సినిమా పట్టాలెక్కేసింది.
టాలీవుడ్లో నిన్నటి వరకు మాస్ సినిమాలు తెరకెక్కించాలంటే వినాయక్ లేదా బోయపాటి పేర్లు మాత్రమే వినపడేవి. అయితే ఇప్పుడు మలినేని గోపీచంద్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పైగా క్రాస్ తర్వాత గోపీచంద్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు మనోడు ఏకంగా బాలయ్యతో సినిమా చేస్తుండడంతో ఖచ్చితంగా భారీ స్థాయిలో ఉంటుందన్న అంచనాలే ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శృతీహాసన్ హీరోయిన్గా ఎంపికైంది. అయితే ఈ సినిమాకు శృతీహాసన్‌కు ఓ సెంటిమెంట్ ఉంది. అదే ఈ సినిమాను ఖచ్చితంగా హిట్ చేస్తుందని అంటున్నారు. గతంలో గోపీచంద్ దర్శకత్వంలో శృతి రెండు సినిమాల్లో నటించింది. 2013లో వీరి కాంబోలో వచ్చిన బలుపు సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ యేడాది మరోసారి క్రాక్ సినిమా కోసం గోపీచంద్ శృతీహాసన్నే తీసుకున్నారు. ఆ సినిమా కూడా కరోనా పాండమిక్‌ను తట్టుకుని మరీ హిట్ కొట్టింది.
ఇక ఇప్పుడు మూడోసారి బాలయ్య సినిమా కోసం కూడా గోపీచంద్ శృతీనే హీరోయిన్గా తీసుకున్నాడు. గోపీచంద్‌తో పాటు శృతికి కూడా బాలయ్యతో ఇదే తొలి సినిమా అవుతుంది. బాలయ్య కెరీర్లో 107వ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో గోపీ-శృతి కాంబోలో హ్యాట్రిక్ హిట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. మెగా బ్యానర్ మైత్రీ మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.