Moviesపీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయిన న‌గ్మా - గంగూలీ మ‌ధ్య ఏం జ‌రిగింది..!

పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయిన న‌గ్మా – గంగూలీ మ‌ధ్య ఏం జ‌రిగింది..!

భార‌త క్రికెట‌ర్ల‌కు, సినిమా హీరోయిన్ల‌కు మ‌ధ్య ఉన్న లింకులు ఈ నాటివి కావు. అప్ప‌ట్లో వివియ‌న్ రిచ‌ర్డ్స్ నుంచి నీనాగుప్తా, అమృతాసింగ్ – ర‌విశాస్త్రి, సంగీతా బిజ్లానీ – అజారుద్దీన్‌, నేడు కోహ్లీ – అనుష్క శ‌ర్మ ఇలా చాలా మంది క్రికెట‌ర్లు, హీరోయిన్ల మ‌ధ్య ఎఫైర్లు, లింకులు న‌డిచాయి. వీరిలో కొంద‌రు పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే మాజీ కెప్టెన్ సార‌వ్ గంగూలీకి, ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో పాటు పొగ‌రుతో సౌత్ ఇండియానే కాకుండా బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ న‌గ్మాకు మ‌ధ్య కూడా చాలా కాలం పాటు ఘాటైన ఎఫైర్ న‌డిచింది.

వీరిద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయారు. ఎక్క‌డ చూసినా వీరే క‌నిపించే వారు. గంగూలీ మ‌న‌దేశంలోనే కాదు.. విదేశాల్లో మ్యాచ్ ఆడినా కూడా న‌గ్మా అక్క‌డ వాలిపోయి సంద‌డి చేసేది. వీరిద్ద‌రు క‌లిసి శ్రీకాళ‌హ‌స్తిలో అప్ప‌ట్లో కుజ‌దోషం పూజ‌లు కూడా చేశారు. ఈ ఫొటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మీడియాలో ప్ర‌ముఖంగా ప్ర‌చురితం అయ్యాయి. అయితే అప్ప‌టికే గంగూలీకి డోనాతో పెళ్ల‌య్యి పిల్ల‌లు కూడా ఉన్నారు.

భార్య ఉండి కూడా సార‌వ్ నగ్మాతో ఎఫైర్ న‌డిపాడు. అప్ప‌టికే న‌గ్మా శ‌ర‌త్‌కుమార్‌తో పాటు భోజ్‌పురి న‌టుడు మ‌నోజ్ తివారీతో ప్రేమాయ‌ణం న‌డిపింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అయితే భార్య డోనాకు విడాకులు ఇచ్చి మ‌రీ గంగూలీ న‌గ్మాను పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నాడు. అయితే గంగూలీ ఫ్యామిలీ నుంచి తీవ్ర‌మైన ఒత్తిడి ఉండ‌డంతో చివ‌ర‌కు న‌గ్మాను వ‌దిలిపెట్ట‌క త‌ప్ప‌లేదు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే తాను, గంగూలీ విడిపోయామ‌ని న‌గ్మా కూడా ఓ సారి చెప్పింది.

అయితే న‌గ్మా అహానికి చోటు ఉన్న బంధం ఎక్కువ కాలం నిల‌వ‌లేద‌ని చెప్పింది. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య వ్య‌క్తిగ‌తంగా కూడా గ్యాప్ వ‌చ్చింద‌ని ఆ మాట‌లే చెపుతాయి. ఇక 46 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చినా కూడా న‌గ్మా ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news