టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే తిరుగులేని ఫామ్‌తో దూసుకు పోతున్నాడు. ఇప్పటికే ఐదు వరుస సూపర్ హిట్లతో ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం డబుల్ హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లతో పాటు గ్లింప్స్ యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి.
ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఎన్టీఆర్ తన భార్య, ఇద్దరు పిల్లలతో లైఫ్‌ను ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ – లక్ష్మి ప్రణతి దంపతుల పెళ్లి 2011లో జరిగింది. వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు పెళ్లి చేయాలని హరికృష్ణ ముందుగా సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారట. ఈ క్రమంలోనే ఎన్నారై సంబంధాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి పారిశ్రామికవేత్తల కుటుంబాల నుంచి కూడా కొందరు హరికృష్ణను కలిసి ఆయనతో వియ్యం అందుకోవాలని ఉందని చెప్పారట.
అయితే జూనియర్ ఎన్టీఆర్‌పై ముందునుంచే ఆయన మామ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఎన్టీఆర్‌ను ఎలాగైనా బయటకు వెళ్లకుండా తమ బంధువుల ఇంట్లోనే అల్లుడిని చేయాలని ఆయన చూస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్‌కు సంబంధాలు వస్తున్న విషయం తెలిసిన వెంటనే బాబు ఆలస్యం చేయకుండా తమ మేనకోడలు కుమార్తెతో పెళ్లి చేసేయాలని డిసైడ్ అయిపోయారు.
అందుకే ఈ పెళ్లి విషయంలో ఆయనే ఆఘమేఘాల మీద చర్చలు జరిపి ఎన్టీఆర్‌ను పెళ్లికి ఒప్పించేశారు. వాస్తవానికి ఎన్టీఆర్‌తో పెళ్లి జరిగే సమయానికి లక్ష్మీ ప్రతణిది చిన్న వయస్సే.. ఆమెకు అప్పటికి కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఇక ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావుది గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం. ఆయన పెద్ద పారిశ్రామికవేత్త.. గతంలో ఆయన స్టూడియో ఎన్ ఛానెల్ కూడా రన్ చేశారు. ఇక ఎన్టీఆర్‌కు ఆయన కోట్లాది రూపాయల కట్న కానుకలు సమర్పించారు.
ఇక ఎన్టీఆర్‌తో పెళ్లికి ముందు లక్ష్మీ ప్రణతి కొన్ని కండీషన్లు కూడా పెట్టిందని అంటారు. తనకు వీకెండ్స్‌లో టైం కేటాయించాలని.. ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లే కార్యక్రమాలు చాలా వరకు తగ్గించుకోవాలని చెప్పిందట. వీటికి ఎన్టీఆర్ కూడా ఒప్పుకున్నారని అప్పట్లో టాక్ బయటకు వచ్చింది. ఏదేమైనా ఎన్టీఆర్ ఫ్యామిలీ లైఫ్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడనే చెప్పాలి.