Moviesనేను ఇంట్లోనే ఉంటే ఇంకా పిల్లలు పుడతారేమో..సైఫ్‌ ఫన్నీ రిప్లై..!!

నేను ఇంట్లోనే ఉంటే ఇంకా పిల్లలు పుడతారేమో..సైఫ్‌ ఫన్నీ రిప్లై..!!

బాలీవుడ్ అందమైన జంటల్లో కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ జంట ఒకటి. ఈ జంట ఎక్కడ కనిపించినా వార్తల్లో నిలుస్తుంటుంది. 2012లో ఈ జంట ఒక్కటైన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇద్దరు వరుస్ అసినిమాలతో బిజీ గా ఉన్నారు. అయితే బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “ఆది పురుష” సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామాయణం ఆధారంగా మైతలాజికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా లో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. సీత పాత్రలో కృతిసనన్ .. ఇక రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ అందరి దృష్టిని ఆకర్షించారు.

ఇక రీసేంట్ గా కపిల్‌ శర్మ షోకు గెస్ట్ గా హాజరయ్యన సైఫ్ అలీ ఖాన్.. ఇంట్లో ఉండటం కన్నా పనులతో బిజీగా ఉండటమే బెటర్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్‌ శర్మ షోకు హాజరయ్యాడు సైఫ్‌. అతడితో పాటు చిత్రయూనిట్‌ సభ్యులు రాణీ ముఖర్జీ, సిద్ధాంత్‌ చతుర్వేది, శర్వానీ సైతం షోలో పాల్గొని సందడి చేశారు .2005లో బిగ్‌బి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించగా సూపర్ హిట్ అయిన ‘బంటీ ఔర్ బబ్లీ’ కి సీక్వెల్‌గా ‘బంటీ ఔర్ బబ్లీ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే.

ఇక్ అషోలో కపిల్ శర్మ ..సైఫ్ అలీ ఖాను ప్రశ్నిస్తూ సైఫ్‌ తాండవ్‌, భూత్‌ పోలీస్‌, ఇప్పుడు బంటీ ఔర్‌ బబ్లూ 2.. ఇలా వరుస సినిమాలు చేయడంపై అడుగుతూ.. ‘మీకు పని అంటే ప్రేమా? లేదంటే రెండో కొడుకు పుట్టాక కుటుంబం కోసం ఎక్కువ పని చేయాల్సి వస్తుందా?,, అని ప్రశ్నించాడు. దీనికి సైఫ్‌ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువమమంది పిల్లలు పుట్టేలా ఉన్నారని, ఆ భయంతోనే ఇలా సినిమాలతో బిజీగా ఉన్నానన్నాడు. దీంతో అక్కడున్నవారంతా ఘొల్లున నవ్వారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్‌గా మారింది. ఇక ఈ ‘బంటీ ఔర్ బబ్లీ 2’ సినిమాను వి.శర్మ డైరెక్ట్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సీక్వెల్‌లో సైఫ్, రాణీలతో పాటు మరో యువ జంట సిద్ధాంత్ చతుర్వేది, షర్వారీ కూడా నటించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news