Movies"గుర్తు పెట్టుకోండి..ఇక శుభవార్తలు వస్తూనే ఉంటాయి"..సమంత పోస్ట్ వైరల్..!!

“గుర్తు పెట్టుకోండి..ఇక శుభవార్తలు వస్తూనే ఉంటాయి”..సమంత పోస్ట్ వైరల్..!!

సమంత..అక్కినేని నాగార్జున పెద్దకొడుకు నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ ..అవసరం ఉన్నా లేకున్నా పోస్ట్లు పెట్టుకుంటూ..నిత్యం వార్తల్లో నిలుస్తుంది. రీజన్ చెప్పకుండా విడాకులు తీసుకున్న సమంత చైతన్య..మేమొ విడిపోతున్నం అని చెప్పి సరిగ్గ నెల రోజులు కావస్తుంది. కానీ వీళ్లు ఎందుకు విడిపోయారు అనే దాని పై మాత్రం క్లారిటీ రాలేదు. వీళ్లు చెప్పలేదు.. వీళ్ల పెద్ద వాళ్లు చెప్పే సాహసం చేయలేదు.

వాళ్ల నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేసిన ఈ జంటా..ఆ తరువాత సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికి..అవి ఏమి పట్టించుకోకుండా..వాళ్ల పనుల్లో బిజీ అయిపోయారు.నాగ చైతన్య ఇంటికి దూరంగా ఓ ఫ్లాట్ తీసుకుని అక్కడే ఉంటూ తదుపరి సినిమాల పై ఫోకస్ పెట్టారు. ఇక సమంత నాగచైతన్య తో కలిసి ఉంటున్న ఇంట్లోనే ఉంటూ ఆమె తన కెరీర్ పై దృష్టి పెట్టిన్నట్లు తెలుస్తుంది. అయితే సమంత మాత్రం విడాకుల తరువాత తన ఇన్ స్టా లో ఘాటైన పోస్ట్లు పెట్టుకొస్తుంది.

 

విడాకుల తరువాత తన బాధను, భావోద్యేగాలను సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తం చేస్తుంది సమంత. ఈ క్రమంలోనే తరచూ ఏదోఒక పోస్ట్‌ను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ ప్రస్తుత తన కండీషన్‌ చెప్పే ప్రయత్నం చేస్తోన్నట్లు తెలుస్తుంది. దీంతో ఆమె పెట్టిన ప్రతి పోస్ట్‌ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా సామ్‌ తన సోషల్ మీడియా ఖాతాలో మరో పోస్ట్‌ను షేర్‌ చేసింది. ‘గుర్తు పెట్టుకోండి.. ఎల్లప్పుడూ ఏదైన శుభవార్త వస్తూనే ఉంటుంది’ అని రాసి ఉన్న ఫొటోను తన ఇన్స్టా స్టోరీలో పెట్టుకుంది. దీంతో సమంత పోస్ట్ నెట్టింత వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news