చిన్నవయసులోనే నందమూరి వంశం నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. స్టూడెంట్ నెంబర్ వన్ – ఆది – సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో ఎన్టీఆర్ కెరీర్ దూసుకుపోయింది. ఎన్టీఆర్ హీరోగా 21 సంవత్సరాల పూర్తి చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.
చిన్నవయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం సినిమాలో రాముడిగా మెప్పించారు. తర్వాత తాత, బాబాయ్ తో కలిసి హిందీ బ్రహ్మర్షి విశ్వామిత్రలో కూడా కనిపించారు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తన కెరీర్లో తొలి సూపర్ హిట్ నమోదు చేసుకున్నారు. కేవలం సాంఘిక కథాంశం ఉన్న సినిమాలతో పాటు ఈ తరం జనరేషన్ హీరోలలో పౌరాణిక పాత్రల్లో కూడా నటించగల ఒకే ఒక్క హీరోను అని ప్రూవ్ చేసుకున్నారు.
అదుర్స్ సినిమాలో డబుల్ రోల్ లో నటించిన ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో త్రి పాత్రాభినయం చేసి మూడు పాత్రల్లో అద్భుతమైన వేరియేషన్స్ తో తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకున్నారు. బి.గోపాల్ – రాజమౌళి – కొరటాల శివ – వివి. వినాయక్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి స్టార్ డైరెక్టర్ తో కలిసి ఎన్టీఆర్ పని చేశారు. ఎన్టీఆర్ నటించిన చివరి సినిమా అరవింద సమేత వీర రాఘవ. గత మూడు సంవత్సరాలుగా ఎన్టీఆర్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.
అటు వెండితెరపై వెలిగిపోతున్న ఎన్టీఆర్ బుల్లితెరపై రియాలిటీ షోలో సైతం తాను అద్భుతంగా హోస్ట్ చేస్తానని బిగ్‌బాస్ సీజన్ వన్, ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రామ్స్ ద్వారా ఫ్రూవ్ చేసుకున్నారు. ఇక 2011లో లక్ష్మీప్రణతిని వివాహం చేసుకున్న ఎన్టీఆర్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా లైఫ్‌తో పాటు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ తన సినీ కెరీర్లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.