Moviesహన్సిక గట్స్ అదుర్స్.. కానీ ఈ సినిమా హిట్ కొట్టేనా?

హన్సిక గట్స్ అదుర్స్.. కానీ ఈ సినిమా హిట్ కొట్టేనా?

హన్సిక.. దేశముదురు సినిమాతో తెలుగు జనాలకు పరిచయం అయ్యిందీ ముద్దుగుమ్మ. తొలి సినిమా తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో పాటు అభినయంతో వారెవ్వా అనిపించుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసింది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. మస్కా, ఓ మై ఫ్రెండ్, బిల్లా, కంత్రి సహా పలు సినిమాల్లో నటించింది. పలువురు స్టార్ హీరోలతో జతకట్టింది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

తొలుత చాలా స్లిమ్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కాస్త బొద్దుగా మారింది. బాడీ షేమింగ్ మారడంతో తనకు సినిమా ఆఫర్లు కాస్త తగ్గాయి. దీంతో మళ్లీ జిమ్ లో వర్కౌట్లు చేసింది. మునుపటితో పోల్చితే చాలా అంటే చాలా స్లిమ్ గా తయారైంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఓ క్రేజీ ప్రాజెక్టు చేస్తుంది. ఇండియన్ సెల్యూలాయిడ్ మీద తొలిసారిగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో తెరకెక్కుతున్న 105 మినిట్స్ లో నటిస్తుంది. రాజు దుస్స దర్శకత్వం వహిస్తున్నాడు. రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ బ్యానర్ మీద బొమ్మక్ శివ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీలో హన్సిక్ కీ రోల్ ప్లే చేస్తుంది.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింన్స్ వీడియోను దీపావళి సందర్భంగా రిలీజ్ చేశాడు. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ దీన్ని విడుదల చేశాడు. హాలీవుడ్ లో మాదిరి సింగ్ షాట్ షూటింగ్ అంటే చాలా ఇష్టం అన్నాడు. మనవాళ్లు ఇంకా ఎందుకు ప్రయత్నించడం లేదు అనుకుంటుండగా.. ఈ సినిమా తెరకెక్కిందన్నాడు . 105 మినిట్స్ పేరుతో చేసిన సినిమా చాలా థ్రిల్లింగా ఉందన్నాడు. ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం అయినా.. ప్రయత్నించిన దర్శకుడిని అభినందించాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. విడుదలపై త్వరలో ఓ ప్రకటన రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news