సూపర్‌స్టార్ రజనీకాంత్ – సిరుత్తై శివ కాంబినేషన్లో తెరకెక్కిన పెద్దన్న సినిమా నిన్న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1990 నాటి కాలం ముతక కథతో ఈ సినిమాను తెరకెక్కించారని ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు. ఇక రజనీకాంత్ నుంచి గతంలోనే ఈ తరహా కథతో ఎన్నో సినిమాలు చూశామని.. ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. కేవలం రజనీ కాంత్ స్టైల్ మేనరిజమ్, ఫైట్లు కోసం మాత్రమే తప్పా ఈ సినిమా పరమ వరస్ట్ అని తేల్చేస్తున్నారు.
ఇక ఇప్పటి వరకు దర్శకుడు శివ తీసిన సినిమాలు అన్ని పాత కథలనే అటూ ఇటూ తిప్పి తీస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా శివ పెద్దన్న సినిమాను అలాగే పరమ రొటీన్‌గా తీసి పడేశారన్న విమర్శలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఇక విలన్లుగా ఉన్న జగపతిబాబు క్రూరమైన లుక్‌తో ఎంట్రీ ఇచ్చినా ఆయన క్యారెక్టర్‌ను తుస్సు మనిపించేశాడని పెదవి విరుస్తున్నారు.
అసలు రజనీకాంత్ కబాలీ, కాలా, పేట, దర్బార్ సినిమాలకే హైప్ లేదు. ఇక ఇప్పుడు పెద్దన్న కూడా ఆ సినిమాలకన్నా డిజాస్టర్ అన్నట్టుగా ఉంది. ఇక ఈ సినిమా చూస్తోన్న ప్రేక్షకులు బీపీకి, షుగర్ కు ల్యాబుల్లో పరీక్షలు ఉంటాయి.. అదే సహనానికి ఎంత మాత్రం పరీక్ష ఉండదు. అయితే సహనాన్నీ పరీక్షించుకోవాలంటే ఈ సినిమా చూస్తే సరిపోతుందని సెటైర్ వేస్తున్నారు.
ఎవరైనా పెద్దన్న సినిమా చూస్తూ ఇంటర్వెల్లో కూడా పారిపోకుండా ఉంటే అతడికి సహనం ఉన్నట్టే లెక్క అని అంటున్నారు. ఇక పెద్దన్న సినిమాకు అసలు స్టార్లు ఇవ్వడమే దండగ అని.. అయితే ఈ సినిమా మొత్తం చూసిన ప్రేక్షకులకు మాత్రం ఫైవ్ స్టార్ ఇవ్వొచ్చని అంటున్నారు.