Moviesరాజ‌మౌళి మేన‌కోడ‌లు ఎవ‌రో తెలుసా.. ఆమె కూడా ఓ స్టారే..!

రాజ‌మౌళి మేన‌కోడ‌లు ఎవ‌రో తెలుసా.. ఆమె కూడా ఓ స్టారే..!

తెలుగు సినిమా రంగం ఎప్ప‌ట‌కి గ‌ర్వించే ద‌ర్శ‌కుడు మ‌న ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి. స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ సినిమాతో మెగాఫోన్ ప‌ట్టిన రాజ‌మౌళి ఇప్ప‌టి వ‌ర‌కు ఇన్నేళ్ల‌లో ఒక్క ప్లాప్ కూడా లేకుండా వ‌రుస హిట్ల‌తో దేశంలోనే టాప్ డైరెక్ట‌ర్‌గా ఉన్నాడు. ఎంత గొప్ప డైరెక్ట‌ర్‌కు అయినా ఇన్నేళ్ల‌లో ఒక్క ప్లాప్ కూడా లేదంటే ఎంతో గొప్ప విష‌యం అని చెప్పాలి. ఇక రాజ‌మౌళి ఫ్యామిలీ కూడా రాజ‌మౌళికి ఎప్పుడూ స‌పోర్ట్ చేస్తూ ఉంటోంది.

ఆ ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ ర‌క‌ర‌కాల రంగాల్లో టాలెంట్ ప‌ర్స‌న్స్‌. కీర‌వాణి, శ్రీలేఖ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌. ఇక రాజ‌మౌళి భార్య ర‌మా ప్ర‌ముఖ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌. ఇక రాజ‌మౌళి కుమారుడు కార్తీకేయ కూడా ప‌బ్లిసిటీ రంగంలో టాప్ ప‌ర్స‌న్‌. ఇక తండ్రి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ద‌ర్శ‌క‌త్వంలో కూడా రాటుతేలుతున్నాడు. ఇక రాజ‌మౌళికి ఓ మేన‌కోడలు కూడా ఉన్నారు. ఆమె ఓ రంగంలో ఫేమ‌స్‌.

ఆమె ఎవ‌రో కాదు ఇషిత కోడూరి. ఈ కాలంలో అబ్బాయిల‌తో స‌మానంగా అమ్మాయిలు కూడా స్పోర్ట్స్‌లో రాణిస్తార‌న్న నిజాన్ని ఆమె ఫ్రూవ్ చేసి చూపిస్తున్నారు. ఇషిత ఇటీవ‌ల జ‌రిగిన ఉమెన్ అండ‌ర్ -19 క్రికెట్ టోర్న‌మెంటులో పాల్గొన్నారు. ఆమె ఫాస్ట్ బౌల‌ర్‌గా ఆక‌ట్టుకోవ‌డంతో పాటు హైద‌రాబాద్ టీం గెలివ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి త‌న ట్వీట్ట‌ర్‌లో షేర్ చేయ‌డంతో ఇషిత గురించి ఎక్కువ మందికి తెలిసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news