Moviesదేవీ శ్రీ ప్ర‌సాద్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా..!

దేవీ శ్రీ ప్ర‌సాద్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా..!

దేవి శ్రీ ప్రసాద్ తెలుగు సినీ మ్యూజికల్ ప్రపంచంలో ఈ పేరు వింటేనే ఎవరికైనా మాంచి ఊపు వ‌స్తుంది. రొమాంటిక్ – సెంటిమెంట్, దుమ్మురేపే మాస్ సాంగ్స్… హుషారెత్తించే ఐటంసాంగ్ ఏ బిట్ అయినా దేవిశ్రీ తన సంగీతంతో ప్రేక్షకులను మైమరిపింప‌ చేస్తాడు. హుషారు అనే పదానికి దేవిశ్రీ స్వచ్ఛమైన నిర్వచనం. దేవి శ్రీ ప్రసాద్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం లోని వెదురుపాక. 1979 ఆగస్టు 2వ తేదీన గొర్తి సత్యమూర్తి, శిరోమణి దంపతులకు దేవిశ్రీప్రసాద్ జన్మించాడు. దేవి శ్రీకి తమ్ముడు సాగర్ తో పాటు చెల్లి ప‌ద్మిని ఉన్నారు.

ఆయన తండ్రి సత్యమూర్తి గొప్ప సినిమా రైటర్. దేవత – ఖైదీ నెంబర్ 786 – అభిలాష – ఛాలెంజ్ వంటి సూపర్ హిట్ సినిమాలకు ఆయన క‌థ‌ అందించారు. ఆయన వల్లే దేవిశ్రీ సినిమాల్లోకి వచ్చారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ కు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. ఆయనకు విచిత్రంగా ఈ పేరు పెట్టారు అని చెప్పాలి. దేవి శ్రీ ప్రసాద్ అమ్మమ్మ‌ పేరులోని దేవి, తాతయ్య పేరులోని ప్రసాద్ ను తీసుకొని దేవి శ్రీ ప్రసాద్ గా పేరు పెట్టారు. దేవీ శ్రీ చెన్నైలో ఇంటర్ వరకు చదువుకున్నారు.

ఇక దేవి శ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కావటం కూడా విచిత్రంగా జరిగింది. ఒక రోజు ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు దేవిశ్రీప్రసాద్ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో దేవిశ్రీ లోపల సంగీతంపై సాధన చేస్తున్నారు. ఆ శబ్దాలు విన్న రాజు ఒక సందర్భం చెప్పి దానికి ట్యూన్ ఇవ్వమని అడిగారట. వెంటనే దేవిశ్రీ రెండే రెండు నిమిషాల్లో ఇవ్వడంతో ఫిదా అయిపోయార‌ట‌.

వెంటనే తన బ్యానర్ లో తెరకెక్కుతున్న దేవి సినిమాకు సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చారు. విచిత్రమేంటంటే అప్పుడు దేవిశ్రీ ప్లస్ టు చదువుతున్నారు. అలా తొలి సినిమా దేవి సూపర్ డూపర్ హిట్ కావడంతో దేవిశ్రీ ప్రసాద్ పేరు మార్మోగిపోయింది. అక్కడి నుంచి దేవిశ్రీ వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ రోజు తెలుగు సినిమా చరిత్రలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news