Moviesసూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ త‌ర్వాత ఆ రేర్ రికార్డ్ యంగ్‌టైగ‌ర్ ఒక్క‌డికే సొంతం..!

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ త‌ర్వాత ఆ రేర్ రికార్డ్ యంగ్‌టైగ‌ర్ ఒక్క‌డికే సొంతం..!

నందమూరి ఫ్యామిలీ లో జూనియర్ ఎన్టీఆర్ కు ఈ త‌రం జ‌న‌రేష‌న్‌లో తిరుగులేని క్రేజ్ ఉంది.చాలా మంది యువతకు ఎన్టీఆర్‌ ఆదర్శం.. స్టైల్ కి మారుపేరు.. ఫ్యాన్ ఫాలోయింగ్ విషయానికి వస్తే తాతకు ఉన్నంత క్రేజ్.. అంతేకాదు ఏదైనా ఒక సినిమాలో నటించాడు అంటే తన మొత్తం మేకోవర్ చేంజ్ చేయించుకొని పాత్రకు తగ్గట్టు లీనమైపోయి నటించేంత స్టామినా ఉన్న వ్యక్తి. అందుకే నందమూరి ఫ్యామిలీ లో జూనియర్ ఎన్టీఆర్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. ముఖ్యంగా ఆయన అభిమానులకు ఇచ్చే గౌరవం ఒక ప్రత్యేకం. అందుకే అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఎన్టీఆర్ అంటే తెగ ఇష్టపడతారు.

అంతేకాదు విదేశాల్లో కొన్ని చోట్ల‌ సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నిజానికి ఈయన ఏ విషయంలో అంత క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ నటించిన బాద్ షా సినిమా జపనీస్ లాంగ్వేజ్ లో డబ్ అయ్యి ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. అంతేకాదు జపాన్లో రజనీకాంత్ తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోగా ఎన్టీఆర్ చలామణి అవడం గమనార్హం.

జ‌పాన్‌లో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కు ముత్తు సినిమా నుంచి మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్‌కు కూడా చాలా త‌క్కువ టైంలోనే అక్క‌డ ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. భారతదేశంలోనే కాకుండా జపాన్ దేశంలో కూడా ఒక తెలుగు హీరో గుర్తింపు తెచ్చుకోవడం అంటే అంత ఆషామాషీ కాదు. కానీ తమిళ సినిమా ద్వారా రజనీకాంత్ గుర్తింపు పొందితే, తెలుగు సినిమా ద్వారా ఎన్టీఆర్ మంచి పేరును సంపాదించుకున్నారు. జ‌పాన్ అభిమానులు ఎన్టీఆర్ అశోక్ సినిమాలో పాట‌ల‌కు డ్యాన్స్ చేసిన వీడియోలు సోష‌ల్ మీడియాలో ఎలా ? వైర‌ల్ అయ్యాయో మ‌నం చూశాం.

అంతే కాదు ఎన్టీఆర్ ఇప్పటి వరకు 7 సార్లు పాటలు పాడడం విశేషం. యమదొంగ, కంత్రి, అదుర్స్ , రభస, నాన్నకు ప్రేమతో , చక్ర వ్యూహం , యువరత్న వంటి సినిమాలలో తన గొంతును వినిపించాడు. ఒక సినిమాకు తానే స్వయంగా కొరియోగ్రాఫర్ గా కూడా మారాడు. ఇక ప్రస్తుతం ఆర్ ఆర్ త‌ర్వాత‌ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news