బాలీవుడ్ సీనియర్ హీరో రేఖ అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1980 – 90 వ దశకంలో రేఖ దేశ వ్యాప్తంగా ఎంతో మంది యువత కలల దేవత. ఆమె అందానికి అప్పట్లో కుర్రకారు పడి చచ్చేవాళ్లు. రేఖ సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర యువత పోటెత్తేవారు. ఆమె ఎన్నో సినిమాల్లో సంచలన క్యారెక్టర్లతో దేశ వ్యాప్తంగానే అప్పట్లో తిరుగులేని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆమె జీవితంలో ఏది చేసినా ఓ సంచలనమే అన్నట్టుగా ఉండేది.
రేఖ – అమితాబచ్చన్ ప్రేమాయణం అప్పట్లో దేశాన్ని ఊపేసింది. అయితే సడెన్‌గా అమితాబ్‌తో రేఖకు బ్రేకప్ అయ్యింది. రేఖ కోలీవుడ్ సీనియర్ హీరో జెమినీ గణేషన్ కుమార్తె. జెమినీ గణేషన్, తెలుగు హీరోయిన్ పుష్పవల్లి కుమార్తె అయిన రేఖ హీరోయిన్ అవ్వడానికి ముందు ఎయిర్ హోస్ట్‌గా పనిచేసింది. ఆమె బాలీవుడ్‌లో అమితాబ్, ధర్మేంద్ర, జితేంద్ర, శతృఘ్నుసిన్హా, సంజయ్ దత్ లాంటి స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది.
ఒక్క దిలీప్‌కుమార్ పక్కన నటించకపోవడమే తనకు పెద్ద లోటు అని ఆమె అప్పుడప్పుడూ చెపుతూ ఉండేది. రేఖ గొప్ప నటి మాత్రమే కాదు.. పెద్ద మిమిక్రీ ఆర్టిస్టు కూడా..! ఆమె నీతు సింగ్, స్మితా పాటిల్ లాంటి వారికి కూడా డబ్బింగ్ చెప్పారు. ఇక రేఖకు మేకప్ వేసుకోవడం ఎంతో ఇష్టం. ఆమె తన మేకప్‌ను తానే స్వయంగా వేసుకునే వారు. ఆమెకు చాలా అందంగా కనిపించాలన్న కోరిక బాగా ఎక్కువ అట. రేఖ తల్లి పుష్పవల్లి తెలుగు వారే. ఏపీలోని చిత్తూరు జిల్లా ఆమె స్వస్థలం. రేఖ, హేమమాలిని మంచి స్నేహితులు.