మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు చెప్పగానే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పూనకం వచ్చినట్టు ఊగిపోతారు. కొణిదెల శివశంకర్ ప్రసాద్ కాస్తా సినిమా రంగంలోకి వచ్చి.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగి ఈ రోజు టాలీవుడ్ ను దశాబ్దాలుగా శాసిస్తూ మెగాస్టార్ అయిపోయారు. పదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చినా కూడా చిరు జస్ట్ టైమ్ గ్యాప్ అంతే టైమింగ్ గ్యాప్ కాదు అన్న డైలాగ్‌తో ఖైదీ నెంబర్ 150 తో మళ్లీ బ్లాక్ బస్టర్ కొట్టారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాలో చిరుతో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ సైతం నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చిరు వరుస పెట్టి క్రేజీ కాంబినేషన్లను పట్టాలు ఎక్కిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ – కేఎస్. రవీంద్ర దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య – మోహన రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఓ సినిమాకు ఓ హీరో కోటి రూపాయలు తీసుకున్న ఘనత చిరంజీవిదే.
1992లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఘరానా మొగుడు సినిమా కోసం చిరు తొలిసారిగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు. దేవి ఫిలింస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కె. దేవీ వరప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. చిరు పక్కన వాణీ విశ్వనాథ్‌తో పాటు నగ్మా హీరోయిన్లుగా నటించారు. నగ్మా మెయిన్ హీరోయిన్. పొగరు బోతు నగ్మాను చిరు ఎలా అణిచాడు ? అన్న పాయింట్ సినిమాలో ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో రు. 10 కోట్లకు పైగా షేర్ రాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పాత రికార్డులను తిరగరాసింది.