దాదాపు 20 సంవత్సరాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పదుల సంఖ్యలో సినిమాలలో నటించి మంచి విజయాలను సొంతం చేసుకున్న ఏకైక నటి వాణిశ్రీ. ఏ పాత్రలోనైనా సరే ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మరీ నటించేది. ముఖ్యంగా డామినేట్ చేసే పాత్రలని వాణిశ్రీకి దర్శకులు ఇచ్చేవారు.. ఎప్పుడు రిచ్ లుక్ తో చాలా అందంగా ఎన్నో సినిమాలలో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది వాణిశ్రీ. అసలు పేరు రత్నకుమారి కాగా ఎస్ వి రంగారావు ఈమె పేరును మార్చడం జరిగింది. తెలుగుతో పాటు ఇతర భాషా సినిమాలో కూడా నటించడం గమనార్హం.
అయితే హీరోయిన్ ఆఫర్లు తగ్గిన తర్వాత పెళ్లి చేసుకుని సంసార జీవితానికి ప్రాధాన్యతనిచ్చింది వాణిశ్రీ. ఇకపోతే కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాలలో, సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చి తల్లి పాత్రలతో బిజీ అయిపోయారు. 10 వ తరగతి వరకు చదువుకున్న వాణిశ్రీ ఆతర్వాత భరతనాట్యం నేర్చుకుంది. ఇక మొదటి రోజుల్లో కామెడీ రోల్స్ లో ఎక్కువ గా నటించారు వాణిశ్రీ. ఇకపోతే వాణిశ్రీ కుటుంబం గురించి కొన్ని నిజాలు అభిమానులకు పెద్దగా తెలియదు.
వాణిశ్రీ చిన్నతనంలోనే తండ్రిని ,అక్కను, ఇద్దరు తమ్ముళ్లను కోల్పోయింది.. ఇక తల్లి వెంకమ్మ తో చాలామంది సావిత్రి.. వాణిశ్రీ లా ఉంటారు అని చెప్పడంతో వాణిశ్రీకి సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. సినిమాల్లోకి రాక ముందు కొన్ని నాటకాలలో కూడా నటించారు. అయితే ఆమె పేరు మార్చుకోవడం తో తన జీవితం కూడా మారిపోయిందనే చెప్పాలి.ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి. ఈమెను ఈమె బావ మోసం చేయగా , న్యాయపోరాటం చేసి మరీ గెలిచింది. ఫ్యామిలీ డాక్టర్ అయినటువంటి కరుణాకర్ ను ఈమె వివాహం చేసుకుంది.. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు కూడా జన్మించారు.ఈమె కొడుకు అభినయ వెంకటేష్ కార్తిక్ కూడా కరోనా సమయంలో మెంటల్ గా అప్ సెట్ అయ్యి సూసైడ్ చేసుకున్నారు. ఇలా ఈమె జీవితంలో అన్నీ కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి.