Gossips‘స్పిరిట్‌’ నుండి క్రేజీ అప్డేట్: కొరియన్‌ బ్యూటీతో రొమాన్స్ చేయనున్న ప్రభాస్..?

‘స్పిరిట్‌’ నుండి క్రేజీ అప్డేట్: కొరియన్‌ బ్యూటీతో రొమాన్స్ చేయనున్న ప్రభాస్..?

ప్ర‌స్తుతం మ‌న మూవీ మేక‌ర్స్ కొత్త కాన్సెప్ట్ సినిమాల‌ను నిర్మించ‌డానికి ఆస‌క్తి చూపించ‌డ‌మే కాదు.. మంచి కాన్సెప్ట్ సినిమాల‌ను ఇత‌ర భాష‌ల నుండి రీమేక్‌లు కూడా చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ముఖ్యంగా మ‌న మేక‌ర్స్ కొరియ‌న్ సినిమాల‌ను రీమేక్‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. స‌మంత అక్కినేని న‌టించి ఓ బేబీ చిత్రం మిస్ గ్రానీ అనే కొరియ‌న్ మూవీకి రీమేక్ అనే సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

అయితే అర్జున్ రెడ్డి సినిమాతో తిరుగులేని విజయం అందుకున్న సందీప్ వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ‘స్పిరిట్‌’ అనే పేరును ఖరారు చేసి ఇటీవల అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు మేకర్స్‌. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనున్నత్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. ఈ సినిమాను టీ సిరీస్‌, వంగా పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి.

ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా హీరోయిన్‌ ఎవరా? అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్‌గా సౌత్‌ కొరియన్‌ బ్యూటీ నటించనుందని టాక్‌ వినిపిస్తోంది. కొరియన్‌ టీవీ డ్రామాలతో ఫేమ్ సంపాదించుకున్న సాంగ్ హై క్యోను ఈ మూవీలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news