Moviesషాకింగ్: బిగ్‌బాస్‌ లో అపశృతి.. కత్తితో పొడుచుకోబోయిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌..అసలు ఏమైందంటే..!!

షాకింగ్: బిగ్‌బాస్‌ లో అపశృతి.. కత్తితో పొడుచుకోబోయిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌..అసలు ఏమైందంటే..!!

ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన బిగ్‌బాస్ షో.. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా మంచి సక్సెస్ సాధించింది. అదే ఊపుతో తెలుగులో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదో సీజన్‌ జరుగుతుంది. కానీ హిందీలో మాత్రం ఇప్పటి వరకు బిగ్‌బాస్ రియాలిటీ షో 14 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. బిగ్‌బాస్ హిందీ షో ప్రతిఏటా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు.

పెద్ద పెద్ద సినిమాలకు రానంత క్రేజ్ హిందీ బిగ్‌బాస్‌కు వస్తుంది. ఈ హిందీ షోకి రేటింగ్స్ కూడా విపరీతంగా ఉంటాయి. అయితే తాజాగా బిగ్‌బాస్ 15వ సీజన్ మొదలైన సంగతి తెలీసందే. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ప్రవేశించారు. ప్రస్తుతం హౌస్‌ కెప్టెన్‌గా కొనసాగుతోన్న ఉమర్‌ రియాజ్‌కు బిగ్‌బాస్‌ కొత్త టాస్క్‌ ఇచ్చాడు. కరణ్‌ కుంద్రా, తేజస్వి ప్రకాశ్‌, నిషాంత్‌ భట్‌, అఫ్సానా ఖాన్‌లలో ముగ్గురిని వీఐపీ టికెట్‌ కోసం ఎంచుకోవాలన్నాడు.

అయితే ఉమర్‌ అఫ్సానాను తప్పించి మిగతా ముగ్గురిని ఎంచుకున్నాడు. దీంతో ఆవేశంతో అఫ్సానా… హౌస్‌లో అందరూ తననే టార్గెట్‌చేస్తున్నారని మండిపడుతూ.. నమ్మించి మోసం చేస్తున్నారని వెంటనే అక్కడున్న ఓ కత్తిని అందుకుని తనను తాను గాయపర్చుకునేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమైన రియాజ్‌, కరణ్‌ ఆమెను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news