స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో పుష్ప సినిమా వస్తోంది. రెండు పార్టులుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ను డిసెంబర్ 17న రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు రిలీజ్‌డేట్ దగ్గర పడుతోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు పెద్ద సినిమా వాళ్లకు షాకులు ఇస్తున్నాయి. ఇక పుష్ప పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో సమంతపై ఐటెం సాంగ్ షూట్ చేయనున్నారు. అయితే ఇలాంటి టైంలో బాంబు లాంటి వార్త బయటకు వచ్చింది.
ఈ సినిమా దర్శకుడు సుకుమార్ అస్వస్థతకు గురికావడంతో.. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారట. విశ్రాంతి లేకుండా పని చేయవద్దని సీరియస్‌గానే చెప్పడంతో సుకుమార్ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గత రెండు నెలలుగా పుష్ప పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్ తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారని అంటున్నారు. ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఇతర పనుల్లో ఒత్తిడితో ఉండడంతో ఆరోగ్యం దెబ్బతిందట.
ఈ నెలాఖరుకు అయినా సుకుమార్ కోలుకుని వస్తేనే ఈ ఐటెం సాంగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా పూర్తవుతాయి. లేదంటే పుష్ప రిలీజ్ డేట్ మళ్లీ మారుతుంది. అదే జరిగితే సంక్రాంతికి ఈ సినిమా రాదు.. మళ్లీ ఏ మార్చిలోనో లేదా ఏప్రిల్‌లోనే ఈ సినిమా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ బాగా టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే రెండేళ్లకుగా ఈ సినిమా షూటింగ్‌లోనే ఉంది.
కనీసం ఈ డిసెంబర్లో అయినా సినిమా వస్తుందని అనుకుంటే.. ఇప్పుడు ఇదేం షాక్రా బాబు అని తలలు పట్టుకుంటున్నారు. మరి సుకుమార్ ఎంత త్వరగా కోలుకుని వస్తే అంత త్వరగా ఇక్కడ టెన్షన్ తగ్గేలా ఉంది.