MoviesOfficial: పెళ్లి పీఠలు ఎక్కనున్న కంగనా..అబ్బాయి ఎవరో తెలుసా..?

Official: పెళ్లి పీఠలు ఎక్కనున్న కంగనా..అబ్బాయి ఎవరో తెలుసా..?

కంగనా రనౌత్.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు మొహానే చెప్పడం ఆమె అలవాటు. హిందీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్.. అంతేకాదు మంచి నటిగా కూడా పేరు సంపాదించుకున్నారు. చలన చిత్ర పరిశ్రమలో తన నటనతో స్టార్ హీరోలతో సమానమైన స్థానాన్ని సంపాదించుకుంది. పాత్రకి అనుగుణంగా ఆమె చూపే నటనా కౌశల్యాన్ని అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు.

బాలీవుడ్ లో ఎలాంటి చాలెంజింగ్ పాత్ర అయినా సరే చేసి చూపెట్టే సత్తా ఉన్న భామల్లో కంగనా రనుత్ ఒకరు. ఆమె అభినయం ఎంత గొప్పగా ఉంటుందో ఆమె అందాల ప్రదర్శన అదే రేంజ్ లో ఉంటుంది. బాలీవుడ్ టఫ్ఫెస్ట్ హీరోయిన్ గా కంగనా రనుత్ క్రేజ్ తెచ్చుకుంది. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ అందాలను గుమ్మరిస్తుంది కంగనా. ఇక త్వరలోనే అమండు పెళ్లి పీటలు ఎక్కనుందన్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన భాగస్వామి గురించి మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది. త్వరలోనే తాను పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని ఫ్యామిలీ లైఫ్ మొదలుపెట్టనుందని కంగనా తెలిపింది. తన లైఫ్‌లో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారన్న విషయం కూడా బయటపెట్టేసింది.తన గురించి వివరాలు మీకు త్వరలోనే తెలుస్తాయని స్టేట్‌మెంట్ ఇచ్చేసింది కంగనా. దీంతో కంగనాను ప్రేమలో పడేసిన వారు ఎవరో తెలుసుకుందామని బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఫైర్ బ్రాండ్ మనసును కొల్లగొట్టిన ఆ మిస్టర్ ఫైర్ బ్రాండ్ ఎవరై ఉంటారా అని బాలీవుడ్ లో సెర్చింగ్ మొదలుపెడుతున్నారు నెటిజన్స్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news