విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ ఎన్టీఆర్ , ఆయన తనయుడు యువరత్న బాలకృష్ణ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ తండ్రి కొడుకులు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అందులో ఎన్నో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరి కాంబినేషన్లో 12 సినిమాలు వస్తే.. అందులో 7 సినిమాలకు ఎన్టీఆరే దర్శకత్వం వహించారు. బాలయ్య ఎప్పుడూ తండ్రి మాటను గౌరవించే వారు. తండ్రి సెట్లో ఉంటే బాలయ్య చాలా సైలెంట్‌గా ఉండడంతో పాటు ఆయన ఏం చెపితే అది చేసేవారట.
అయితే బాలయ్య ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాకు దర్శకత్వం వహించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా దర్శకత్వం నుంచి బాలయ్య తప్పుకున్నారు. అదే సినిమాయో కాదు సామ్రాట్ అశోక్. ఎన్టీఆర్ కెరీర్లో చివరి బ్లాక్‌బస్టర్ మేజర్ చంద్రకాంత్. ఆ సినిమా తెలుగు నాట ఎన్నో సంచలనాలు సాధించింది. ఎన్టీఆర్ 1994లో అధికారంలోకి రావడానికి ఆ సినిమా మంచి ఊపు ఇచ్చిందని అంటారు.
ఆ సినిమా తర్వాత సామ్రాట్ అశోక్ వచ్చింది. ఈ సినిమాలో వాణీ విశ్వనాథ్ హీరోయిన్. ఈ సినిమాకు ముందుగా దర్శకుడు ఎన్టీఆర్ అనుకున్నారు. అయితే చాలా తక్కువ టైంలో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని బాలయ్యకు ఎన్టీఆర్ కండీషన్ పెట్టారు. అయితే దర్శకుడిగా అంత స్పీడ్‌గా షూటింగ్ చేస్తే క్వాలిటీ రాదని బాలయ్య ఎన్టీఆర్‌తో విబేధించారు.
చివరకు ఎన్టీఆరే స్వయంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక బాలయ్య తాజా సినిమా అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్.