Moviesఎన్టీఆర్ తర్వాత అతడే అనుకుంటున్న సమయంలో... అనుకోని ఘటన

ఎన్టీఆర్ తర్వాత అతడే అనుకుంటున్న సమయంలో… అనుకోని ఘటన

ఇప్పుడంటే హీరోగా మారడం చాలా సింపుల్. కానీ తెలుగు సినిమా ప్రారంభమైన తొలి నాళ్లలో మాత్రం హీరోగా అవకాశాలు రావడమంటే ఆషామాషీ కాదు. అటువంటిది ఓ కుర్రాడికి తెలుగు తెర హీరోగా అవకాశమిచ్చింది. అతడిని ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాపర్తిలో 1936 సెప్టెంబర్ 2న జన్మించిన బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు అప్పట్లోనే ఎన్టీఆర్ తర్వాత అంతటి ఘనుడని తెలుగు ఇండస్ట్రీ కీర్తించింది. అతడికి రోల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. కానీ మద్యానికి అలవాటు పడిన హరినాథ్ తనకు అంది వచ్చిన అవకాశాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. తద్వారా హీరోగా అతడిని జనాలు మరిచిపోయారు.

హరినాథ్ కు ఒక్కసారిగా స్టార్ డమ్ వచ్చేసరికి డబ్బు హోదా ఒక్క సారిగా వచ్చి పడ్డాయి. దీంతో హరినాథ్ గారు తాగుడుకు అలవాటు పడ్డారు. అమ్మాయిలు వ్యసనం కు అలవాటు పడి ఆఫర్లను వదులుకున్నాడు. దీంతో హరినాథ్ కాలం మొత్తం వృథా అయిపోయింది. అలనాటి స్టార్ నటుడు ఎస్వీఆర్ తో హరినాథ్ స్నేహం చేశాడు. వీరిద్దరూ పెద్ద నటులు కావడంతో చాలా ఈజీగానే స్నేహం చిగురించింది.
ఇలా జరుగుతున్న సమయంలో స్టార్ హీరో ఎన్టీఆర్ హరినాథ్ ను పిలిచి మందలించారట. వృత్తిని ప్రేమించాలని అలా అయితేనే మనకు గౌరవం అని హరినాథ్ కి నచ్చచెప్పారు.

కానీ హరినాథ్ ఎన్టీఆర్ మాటలను పెడచెవిన పెట్టారు. అయినా కానీ ఎన్టీఆర్ తాను దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం సినిమాలో రాముడిగి హరినాథ్ కు అవకాశం ఇచ్చారు. దీంతో హరినాథ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కానీ హరినాథ్ మాత్రం తాగుడును మానలేదు. దీంతో కొద్ది కాలంలోనే హరినాథ్ ఫోకస్ సినిమాల మీద తగ్గిపోయింది. దీంతో అతడు మెల్లగా ఫేడ్ అవుట్ అయ్యాడు. అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోకుండా అలనాటి నటుడు హరినాథ్ తన చేజేతులా తన కెరీర్ ను నాశనం చేసుకున్నాడు. హరినాథ్ ఇలా అక్కరకురాకుండా పోవడానికి ఎస్వీఆర్ స్నేహమే కారణమని చెబుతారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news