Moviesజూనియర్ దేవరకొండ దెబ్బైపోయాడే..మడతపెట్టేసారుగా..!!

జూనియర్ దేవరకొండ దెబ్బైపోయాడే..మడతపెట్టేసారుగా..!!

టాలివుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ లో ఓ ఎనర్జిటిక్ స్టార్ అనే చెప్పాలి. పెళ్లిచూపులు సినిమాతో సోలో హీరోగా హిట్ కొట్టి ఆ తర్వాత అర్జున్ రెడ్డి అంటూ స్టార్స్ నే సర్ ప్రైజ్ చేసిన విజయ్ ఆ తర్వాత గీతా గోవిందంతో స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు అతని తమ్ముడు ఆనంద్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇక యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్పక విమానం’. రీసెంట్ గా రిలీజ్‌ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర బొల్తా కొట్టిందనే చెప్పాలి. కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై విజయ్ తండ్రి గోవర్ధనరావు దేవరకొండ, విజయ్, ప్రదీప్ ఎర్రబెల్లి సంయుక్తంగా నిర్మించారు ఈ సినిమాని.

దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాలతో యూత్ కు బాగా కనెక్ట్ అయిన ఆనంద్ నటించిన ఈ చితం పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, సినిమాను అనుకున్నంత క్లారిటీగా తెరకెక్కించలేకపోయాడు దర్శకుడు దామోదర. టీజర్, ట్రైలర్ చూసి ఈ సినిమాలో కమెడీ ఉంటుంది సర్దాగా నవ్వుకోవచ్చు అని అనుకుని వెళ్లిన అభిమానులను నిరాశపరిచారు డైరెక్టర్. ముఖ్యంగా ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌తో వస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ సినిమాలో మాత్రం మర్డర్ మిస్టరీ ఉండటంతో ఆడియన్స్ షాక్ అయ్యారు.

పుష్పక విమానం సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే సినిమా ఎంత డిజాస్టర్ టాక్ తెచ్చుకుందో అర్ధం చేసుకోవచ్చు. పుష్పక విమానం సినిమాను రూ. 2.2 కోట్లకు అమ్మారు. నిజానికి ఆనంద్ దేవరకొండ మార్కెట్‌కు ఇది చాలా ఎక్కువే. కానీ తొలిరోజు కేవలం రూ. 45 లక్షలు షేర్ వచ్చింది. దీంతో నెట్టింట ఆయన పై ట్రోల్స్ పెరిగాయి. ఓ రేంజ్ లో ఈ సినిమాకి పబ్లిసిటి చేసారు..లాస్ట్ కి సినిమా కనీసం పాజిటివ్ టాక్ ను కూడా తెచ్చుకోలేకపోయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news