సర్వత్రా ఆసక్తి రేపుతోన్న తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికల్లో విన్నర్ ఎవరు ? అన్నదానిపై ఎవరికి వారు రకరకాల చర్చల్లో మునిగి తేలుతున్నారు. మాలో మొత్తం 900 ఓటింగ్ ఉంది. వీరిలో 600 మంది మాత్రమే ఓట్లు వేస్తారని అంటున్నారు. ఈ సారి గట్టి పోటీ ఉన్నందున 700 వరకు ఓట్లు పోలైనా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇండస్ట్రీ ఇన్నర్ టాక్ ఎలా ? ఉన్నా బయట మాత్రం పబ్లిక్‌లో ఎక్కువ మంది ప్రకాష్‌రాజ్ గెలవాలని కోరుకుంటున్నారు. ఆన్‌లైన్ ఒపీనియల్స్ పోల్స్ సర్వేలలో, ఛానెల్స్ పోల్స్‌లో ప్రకాష్ రాజ్‌కు ఏకంగా 60 నుంచి 70 శాతం మంది ఓట్లు వేస్తారు.
బయట జనాలకు మాత్రం ప్రకాష్‌రాజ్ గెలవాలన్న కోరిక బలంగా ఉందని అనిపిస్తోంది. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మరో చర్చ నడుస్తోంది. ప్రకాష్‌రాజ్ మా మెంబర్స్‌కు ఏ మాత్రం అందుబాటులో ఉండడని.. మంచు విష్ణు లోకల్‌గా ఉంటాడనే ఎక్కువ మంది అంటున్నారు. మాలో బాగా డబ్బున్న వాళ్లు.. ఎలాంటి అవసరం లేని వాళ్లు 300 మంది వరకు ఉంటారు. మిగిలిన వాళ్లకు ఏవేవో అవసరాలు, ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు యువకుడిగా ఉండడంతో పాటు లోకల్‌గా ఉండే విష్ణుకే తెలుస్తాయని.. విష్ణు అయితేనే వాళ్లకు న్యాయం జరుగుతుందన్న టాక్ వచ్చేసింది.
దీనికి తోడు సీనియర్ హీరోలు అందరూ విష్ణుకే సపోర్ట్ చేస్తున్నారు. ఇక విష్ణు గెలుపుకోసం మోహన్‌బాబు స్వయంగా రంగంలోకి దిగి మెంబర్స్‌కు ఫోన్లు చేస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం మొహమాటానికి మాత్రమే విష్ణుకు ఓటేస్తామని చెపుతున్నా.. తమకు మాత్రం ప్రకాష్‌రాజ్‌కే ఓటేయాలని ఉందని అంటున్నారు. ఓవరాల్‌గా చూస్తే నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎవ్వరూ గెలిచినా 50 ఓట్లకు కాస్త అటూ ఇటూగానే మెజార్టీ ఉండవచ్చని తెలుస్తోంది. ఏదేమైనా సాధారణ ఎన్నికలను మించిన ఉత్కంఠను మా ఎన్నికలు రేకెత్తిస్తున్నాయి.