మా ఎన్నికలు ముగిశాయి. ఇక పలువురు సెలబ్రిటీలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా మా ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మా ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఈ సారి 700 నుంచి 750 ఓట్లు పోల్ అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కొందరు సెలబ్రిటీలు తాము ఎవరికి ఓటేశామో చెప్పేశారు. నాగబాబు తాను ప్రకాష్‌రాజ్‌కే ఓటేశానని చెప్పారు.
ఇక మోహన్‌బాబు, మంచు విష్ణు లాబీయింగ్‌తో జయప్రద – జెనీలియా – మాలాశ్రీ విష్ణుకే ఓటేసినట్టు తెలుస్తోంది. మరో మెగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ప్రకాష్‌రాజ్‌కే ఓటేసినట్టు తెలుస్తోంది. నాగార్జున సైతం ప్రకాష్‌రాజ్‌కే ఓటేశారని అంటున్నారు. ఇక బాలయ్య మా ఎన్నికల్లో ఓటేసేందుకు రాగా.. ప్రకాష్‌రాజ్ ఆయన్ను పలకరించేందుకు ప్రయత్నించినా.. బాలయ్య సీరియస్‌గా పోలింగ్‌బూత్‌లోకి వెళ్లారు.
బాలయ్య బయటకు వచ్చాక ప్రకాష్ రాజ్, విష్ణు ఇద్దరూ సోదరుల్లాంటి వారని చెప్పినా ఆయన విష్ణుకే ఓటేసినట్టు అర్థమవుతోంది. ఇక సీనియర్ నటుల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసిన కృష్ణ, కృష్ణంరాజు, చలపతిరావు, కోట శ్రీనివాసరావు వీళ్లంతా విష్ణునే సపోర్ట్ చేశారు.