ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి ఏ ముహూర్తాన రష్మిక మందన్న అడుగు పెట్టిందో కాని.. అప్పటి నుంచి ఆమె పట్టిందల్లా బంగారమే అయ్యింది. సౌత్ ఇండస్ట్రీలో తెలుగు, తమిళ్, కన్నడను ఓ ఊపు ఊపేసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‌పై కన్నేసింది. బాలీవుడ్లో క్రేజీ ఛాన్సుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. తక్కువ టైంలోనే రష్మిక ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్థాయికి వెళ్లిపోయింది.
అయితే రష్మిక ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తులు కొనుగోలు చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు గోవా, కూర్గ్, మంగళూరు, ఖరీదైన ఇళ్లతో పాటు కర్నాటకలో కాపీ ఎస్టేట్లను కూడా కొనుగోలు చేసినట్టు కన్నడ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఆమెకు బాలీవుడ్ ఛాన్సులు వరుసగా రావడంతో ముంబైలో కూడా ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిందని అంటున్నారు.
తరచూ షూటింగ్‌లకు ముంబై వెళ్లడంతో పాటు అక్కడ హోట్సల్‌లో ఉండాల్సి రావడం ఆమెకు ఇబ్బందిగా మారిందట. అందుకే అక్కడ సొంతంగానే ఓ ఫ్లాట్ కొనేసిందంటున్నారు. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్లో మిస్టర్ మజ్ను, గుడ్ బై సినిమాలు చేస్తోంది. దీంతో ఆమె హైదరాబాద్ టు ముంబై, బెంగళూరు టు ముంబై మధ్య తరచూ చక్కెర్లు కొట్టాల్సి వస్తుండడంతో అక్కడ ఓన్‌గానే ఇళ్లు కొనేసిందంటున్నారు.