మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ – ఐశ్వర్య రాజేష్ జంటగా జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రిపబ్లిక్. దురదృష్ట వశాత్తు సినిమా రిలీజ్ అవుతుందనకుంటోన్న టైంలో సాయి యాక్సిడెంట్‌కు గురయ్యి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందు మెగాఫ్యామిలీ అంతా ప్రమోషన్లతో తమ వంతుగా సాయం చేసింది. ఈ రోజు రిలీజ్ అయిన రిపబ్లిక్ హానెస్ట్ ఎటెంప్ట్‌గా మంచి టాక్ తెచ్చుకుంది. సమకాలీన రాజకీయాల్లో ఉన్న లొసుగులు, ఓటర్ల బలహీనతలను ఆసరాగా చేసుకుని దర్శకుడు రాసుకున్న కథనం బాగుంది.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. మరో ఫీమేల్ లీడ్ రోల్ చేసిన రమ్యకృష్ణ రాజకీయ నాయకురాలి పాత్రలో తన పాత్రతో మెప్పించారు. చాలా ఎమోషనల్ సీన్లు కూడా కనెక్ట్ అయ్యాయి. దర్శకుడు ఎంటర్టైన్‌మెంట్ కన్నా పొలిటికల్ డ్రామా మీదే కాన్‌సంట్రేషన్ చేసినట్టు తెలుస్తుంది. టెక్నికల్‌గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, టేకింగ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్ని బాగున్నాయి. కొన్ని పంచ్‌లు కూడా పేలాయి.
ఫైనల్‌గా చెప్పాలంటే రిపబ్లిక్ ఓ సీరియస్ పొలిటికల్ డ్రామా. ఎక్కడా డీవియేట్ కాకుండా తెరకెక్కిన ఓ సామాజిక రాజకీయ కథ అనే చెప్పాలి. ఓవరాల్‌గా పొలిటికల్ జానర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది. కామెడీ ఎక్కువ ఆశించే వారికి నిరాశ తప్పదు. ఈ సినిమాకు తెలుగులైవ్స్ ఇచ్చే రేటింగ్ 2.75 / 5