Moviesలైవ్ లోనే అలా అడిగేశాడు.. చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చిన అనుపమా...

లైవ్ లోనే అలా అడిగేశాడు.. చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చిన అనుపమా పరమేశ్వరన్ ..!!

ఈమధ్య సోషల్ బ్లాగ్స్ లో సెలబ్రిటీస్ చిట్ చాట్ లో శృతిమించిన కామెంట్స్ ఎక్కువయ్యాయి. పబ్లిక్ ఫోరంలో ఉన్నాం కాస్త పద్ధతిగా మసలు కోవాలన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా ఉండట్లేదు కొందరికి. పొద్దస్థమానం పని పాట లేకుండా ఆన్ లైన్ లో సొల్లేసుకుంటూ కూర్చునే వారికి కొన్ని నెగటివ్ థాట్స్ కూడా వస్తుంటాయి. ఇదిలాఉంటే సెలబ్రిటీస్ మెసేజ్ పంపించే సౌకర్యం వచ్చినందుకు సంతోషపడాలి కాని దాన్ని దుర్వినియోగం చేయకూడదు.

సోషల్ మీడియాలో ఈమధ్య సెలబ్రిటీస్ మీద చెత్త కామెంట్స్ ఎక్కువయ్యాయి. లైవ్ లోకి అభిమానులతో చిట్ చాట్ చేయడానికి వచ్చిన హీరోయిన్స్ ని అసభ్యక్లరంగా మాట్లాడుతూ..పర్సనల్ విషయాలను అడుగుతూ విసిగిస్తున్నారు. దానికి హీరోయిన్స్ సైతం చెప్పుతో కొట్టిన్నట్లు ఆన్సర్ ఇస్తున్నారు. రీసెంట్ గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది హోంలీ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కి.

అనుపమా పరమేశ్వరన్ ఈ పేరు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన పేరే. కేరళ కుట్టి అనుపమా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే సందడికి నెటిజన్లు ఫిదా అవాల్సిందే. చిన్న పిల్లలా మారి చేసే కొంటె చేష్టలు, తన తమ్ముడితో కలిసి చేసే అల్లరిని నెటిజన్లు బాగా ఇష్టపడుతుంటారు. అయితే వెండి తెరపై క్యూట్‌గా కనిపించే ఈ భామ ఎప్పుడూ కూడా తన లిమిట్స్ లోనే ఉంటూ.. అందాల ఆరబోతకు అంత మొగ్గు చూపలేదు.

 

అయితే తాజాగా అభిమానులతో ముచ్చటించడానికి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చింది. ఈ క్రమంలో ఆమె అభిమానులు చాలా మంది రకరకాల ప్రశ్నలు వేసారు. తెలుగులో చేస్తున్న సినిమాలు ఏంటి?, కొత్తగా ఏయే సినిమాలు అంగీకరించారు?, మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం? వంటి ప్రశ్నలనే చాలా మంది అడిగారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ అనుపమ బికినీలో ఉన్న ఫోటోను షేర్ చెయ్యమని అడిగేశాడు. దీనికి అనుపమ చెప్పుతోకొట్టిన్నట్లు సమాధానం ఇచ్చింది. నీ అడ్రస్ పంపు.. నేను ఫోటో పంపుతా.. మీ ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టుకో అని రిప్లై ఇచ్చింది. దీంతో కొందరు ఆమె ఆన్సర్ కరెక్ట్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news