Moviesరజనీకాంత్ కి ఊహించని షాక్..టోటల్ మ్యాటర్ లీక్..?

రజనీకాంత్ కి ఊహించని షాక్..టోటల్ మ్యాటర్ లీక్..?

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. రజినీకాంత్ మూవీ ‘అన్నాత్తే’ దీపావళికి విడుదల అవుతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

కానీ కరోనా కారణంగా మూవీ షూటింగ్ పలు మార్లు నిలిచిపోయింది. మరి అనుకున్న సమయానికే విడుదల అవుతుందా? కదా? అని సందేహం నెలకొన్న వేళ.. అభిమానులకు సన్ పిక్చర్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. మొదటి నుంచి ఈ సినిమాపై వస్తున్న వార్తలను నిజం చేస్తూ ‘అన్నాత్తే’ సినిమాను దీపావళికి విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది చిత్రబృందం. ఇటీవలే ఈ సినిమా షూటింగు పూర్తయింది. ప్రస్తుతం దర్శకుడు శివ ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో బిజీగా ఉన్నాడు.

తాజాగా ఈ సినిమా రన్ టైం ఎంతో తెలిసిపోయింది. సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ‘అన్నాత్తే’ రన్ టైం 2 గంటల 43 నిముషాలు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 4న విడుదల కానున్న ఈ సినిమా ప్రీమియర్స్ నవంబర్ 3నే జరగనున్నాయి. సాధారణంగా రజనీ సినిమాలన్నీ కూడా యాక్షన్ – ఎమోషన్ ప్రధానాస్త్రాలుగా సాగుతుంటాయి. అదే తరహాలో ఆయన తాజా చిత్రమైన ‘అన్నాత్తే’ రూపొందుతోంది అని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news