మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా రిపబ్లిక్. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే రీలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఏం అంచనాలు లేకుండా రీలిజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ఇక ఈ సినిమా టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా చేసింది. అంతేకాదు ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ పవర్ ఫుల్ లేడీ పొలిటికల్ లీడర్ పాత్రలో నటించి..సినిమాని ఓ రేంజ్ లోకి తీసుకెళ్లింది. విలక్షణ దర్శకుడు దేవ కట్టా డైరెక్షన్ ఈ సినిమాకి భారీగా ప్లస్ అయ్యింది.
ఈ సినిమా అందరు ఇష్టపడి చూడడానికి మైన్ రీజన్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తెరకెక్కిన ఈ సినిమాలో కావాల్సినన్ని సామాజిక అంశాలు ఉండడం. అయితే బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా మరీ లాభాలు తీసుకువస్తుందా ? లేదా ? అన్నది పక్కన పెడితే విమర్శకులు మాత్రం సినిమాను ప్రశంసిస్తున్నారు. మరోవైపు సాయితేజ్‌కు యాక్సిడెంట్ కావడంతో ఎవరికి వారు ఈ సినిమాను తమ వంతుగా ప్రమోట్ చేస్తున్నారు.ఇదంతా బాగుంది కానీ ఓ విషయంలో మాత్రం ఈ సినిమా పై ఓ ఊరు ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది.
రిపబ్లిక్ సినిమాపై పశ్చిమ గోదావారి జిల్లా, కొల్లేరు గ్రామాల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.ఎందుకంటే..ఈ సినిమాలో చెరువులను, చేపలను విషతుల్యం చేస్తున్నారని.. మా గ్రామాలపై దుష్ప్రచారం చేసి, మా మనోభావాలు దెబ్బతిసే విధంగా దర్శకుడు దేవా కట్టా ఈ సినిమాను చిత్రీకరించాడని చెప్పుతున్నా ఆ గ్రామ ప్రజలు. దీంతో రిపబ్లిక్ సినిమా ఆపివేయలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, కలెక్టర్ కార్తికేయ మిశ్రాకి కొల్లేరు గ్రామాల వాసులు వినతి పత్రం అందజేశారు. రిపబ్లిక్ సినిమాను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.