Moviesదివ్య‌భార‌తిని మైమ‌రిపించిన ఈ హీరోయిన్‌.. చీక‌టి కోణంలో చిక్కుకుపోయింది..!

దివ్య‌భార‌తిని మైమ‌రిపించిన ఈ హీరోయిన్‌.. చీక‌టి కోణంలో చిక్కుకుపోయింది..!

చాలా చిన్న వ‌య‌స్సులోనే దేశ వ్యాప్తంగా సూప‌ర్ పాపుల‌ర్ హీరోయిన్ అయ్యింది దివ్య‌భార‌తి. బాలీవుడ్ టు టాలీవుడ్ లో ఆమెకు వ‌రుస పెట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు వ‌చ్చాయి. చిన్న వ‌య‌స్సులోనే ఆమెకు వ‌చ్చిన స్టార్‌డ‌మ్ అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. 18 ఏళ్ల వ‌య‌స్సులోనే బాలీవుడ్ నిర్మాత సాజిద్ న‌డియ‌డ్ వాలాను ప్రేమ వివాహం చేసుకున్న ఆమె మృతి ఇప్ప‌ట‌కీ పెద్ద మిస్ట‌రీయే. ఆమె చేసింది త‌క్కువ సినిమాలే అయినా కూడా ఆమె ఇప్ప‌ట‌కీ భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో సంచ‌ల‌నాల‌కు మారు పేరు అయిన హీరోయినే.

ఆమె మ‌ర‌ణం త‌ర్వాత సేమ్ దివ్య‌భార‌తి పోలిక‌లు అంటూ ఆమెను మైమ‌రిపించింది మ‌రో హీరోయిన్‌. ఆమె కూడా కాస్త దివ్య‌భార‌తి క‌ట్స్ ఉండ‌డంతో ఆమె కూడా ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అయ్యింది. ఆమె ఎవ‌రో కాదు మ‌మ‌తా కుల‌క‌ర్ణి. బాలీవుడ్ స్టార్ హీరోల నుంచి ఇటు టాలీవుడ్‌లోనూ ప‌లు సినిమాల్లో న‌టించిన ఆమె అప్ప‌ట్లోనే టాప్ లెస్ ఫొటోల‌తో కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేసింది.

ప్రేమ శిఖ‌రం సినిమాతో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ఆమె ఆ త‌ర్వాత దొంగా పోలీస్ లాంటి సినిమాలు చేసింది. ఫామ్‌లో ఉండ‌గానే ఆమె ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవ‌డం ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌లేదు. తాజాగా ఆమె ఇప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న ఫొటోలు పోస్ట్ చేసి మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఇంత‌కు మ‌మ‌త ఇన్ని రోజులేమైంది. ఎక్క‌డ ఉంది ? అన్నది ఆస‌క్తిక‌ర‌మే.

న్యూయార్క్‌కు చెందిన ఓ ఎన్నారైను పెళ్లాడి అక్క‌డే సెటిల్ అయిన ఆమె త‌ర్వాత అత‌డికి విడాకులు ఇచ్చింది. త‌ర్వాత వీక్కీ గోస్వామిని పెళ్లాడిన ఆమె కొద్ది సంవ‌త్స‌రాల పాటు కెన్యాలో స్థిర‌ప‌డింది. అయితే వీక్కీ మాద‌క ద్ర‌వ్యాల వ్యాపారి. ప్ర‌పంచ వ్యాప్తంగా టాప్ డ్ర‌గ్ సప్ల‌యిర్‌ల‌లో ఒక‌డు. అత‌డిని పెళ్లాడ‌డంతోనే మ‌మ‌త జీవితం చీక‌ట్లో మ‌గ్గిపోయింది. వీక్కీ అనేక కేసుల్లో చిక్కుకు పోవ‌డంతో మ‌మ‌త కూడా ఎన్నో ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news