Moviesబాల‌య్యకు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చే బ్రాండ్ ఇదే..!

బాల‌య్యకు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చే బ్రాండ్ ఇదే..!

తెలుగు సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న షో అన్ స్టాప‌బుల్‌. ఆహా డిజిల్ ప్లాట్ పామ్‌లో న‌వంబ‌ర్ 4న వ‌స్తోన్న ఈ టాక్ షో స్పెషాలిటీ ఏంటంటే సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ దీనిని చేయ‌డం. బాల‌య్య డైలాగులు అంటేనే ద‌బిడి దిబిడి.. అందుకు త‌గ్గ‌ట్టుగానే నిన్న వ‌దిలిన ప్రోమో సైతం పంచ్ డైలాగుల‌తో దుమ్ము రేపేసింది. డిజిట‌ల్ షోను సినిమా స్థాయిలో ఊహించుకునే రేంజ్‌లో బాల‌య్య ప్రోమో ఉంద‌న్న ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు బాల‌య్య టాక్ షో ఏ రేంజ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుందో ? అని వెయిట్ చేస్తున్నారు.

తెలుగు టాప్ హీరోలు, సీనియ‌ర్ హీరోలు అంద‌రూ బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడుతో పాటు వ‌రుస పెట్టి అన్ని సీజ‌న్ల‌కు బిగ్‌బాస్‌ను హోస్ట్ చేస్తూ వ‌స్తున్నారు. చిరు కోటీశ్వ‌రుడు ప్రోగ్రామ్‌కు ఓ సీజ‌న్‌ను హోస్ట్ చేశారు. ఎన్టీఆర్ ఇప్పుడు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు ప్రోగ్రామ్ చేస్తున్నారు.
బాల‌య్య ఇప్ప‌టి వ‌ర‌కు బుల్లితెర మీద‌, టీవీ స్క్రీన్‌, ఓటీటీ ల్లో క‌న‌ప‌డ‌లేదు. అయితే ఆహా తొలిసారి బాల‌య్య‌తో ఇలాంటి షో చేయ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈ టాక్ షో ను మ్యాన్షన్ హవుస్ స్పాన్సర్ చేస్తోంద‌ట‌. బాల‌య్య

ఇక బాల‌య్య‌కు మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ అంటే చాలా.. చాలా ఇష్టమట‌. ఆయన విదేశాలకు వెళ్లినా కూడా ఆ బ్రాండ్ త‌ప్ప‌కుండా ఉంటుంద‌న్న టాక్ ఉంది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు అదే బ్రాండ్ బాల‌య్య టాక్ షోను స్పాన్స‌ర్ చేస్తోంది. మ‌రి ఈ ఆహా టాక్ షో పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇది ఎంత వ‌ర‌కు అందుకుంటుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news